'నువ్వు ధోనివి కాదు'.. ఇషాన్‌ కిషన్‌ అదిరిపోయే రిప్లై

3 Aug, 2023 19:08 IST|Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆకట్టుకున్నాడు. వరుసగా మూడు వన్డేల్లో అర్థసెంచరీలు బాదిన ఇషాన్‌ అరుదైన రికార్డు సాధించాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో ఇషాన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మూడు వన్డేలు కలిపి 184 పరుగులు చేశాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా.. ఇషాన్‌ కిషన్‌ కీపింగ్‌ను ఎంఎస్‌ ధోనితో పోల్చాడు. "స్టంపింగ్, రనౌట్ లను రివ్యూ చేయడం చాలా అరుదు. ఇప్పటి వరకైతే అతని పాదం గ్రౌండ్ పైనే ఉంది. ఇషాన్ నువ్వు కూడా రాంచీ నుంచే వచ్చి ఉండొచ్చు కానీ.. నీ పేరు ఎమ్మెస్ ధోనీ కాదు" అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఆ వెంటనే స్పందించిన ఇషాన్.. హా, ఫిర్ ఠీక్ హై (హా సరే అయితే) అని అనడం'' స్టంప్ మైక్ లో వినిపించింది.

అది విని పక్కనే ఉన్న మరో ఇద్దరు కామెంటేటర్లు నవ్వారు. ఆకాశ్ కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయాడు. ఆ తర్వాత "ఇషాన్ ఆన్సర్ కూడా ఇచ్చేశాడు.. హౌ స్వీట్ ఇషాన్. వీ లవ్ యూ" అని ఆకాశ్ అన్నాడు. దానికి కూడా ఇషాన్ స్పందిస్తూ.. హా సరే అయితే అని మళ్లీ అన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

చదవండి: Australian Open 2023: క్వార్టర్స్‌లో పీవీ సింధు.. ఫామ్‌లోకి వచ్చినట్లేనా!, శ్రీకాంత్‌, ప్రణయ్‌ కూడా

Shahid Afridi-Shaheen Afridi: ఒకే రోజు ఇరగదీసిన మామ అల్లుళ్లు

మరిన్ని వార్తలు