సౌదీ అరేబియాలో ఎఫ్‌1 రేస్‌

6 Nov, 2020 06:15 IST|Sakshi

2021 క్యాలెండర్‌లో చోటు  

దుబాయ్‌: ఫార్ములా వన్‌ (ఎఫ్‌1) రేసు క్యాలెండర్‌లో సౌదీ అరేబియా అరంగేట్రం చేయనుంది. వచ్చే ఏడాది జరిగే ఎఫ్‌1 సీజన్‌లో సౌదీలోని జిద్దా  నగరాన్ని చేరుస్తూ ఎఫ్‌1 నిర్వాహకులు గురువారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సౌదీ ఆటోమొబైల్, మోటార్‌ సైకిల్‌ సమాఖ్య (ఎస్‌ఏఎమ్‌ఎఫ్‌)తో ఒప్పందం కుదిరినట్లు వారు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన జిద్దా నగర శివార్లలోని ‘కార్నిక్‌’ వద్ద వద్ద స్ట్రీట్‌ ట్రాక్‌పై 2021 నవంబర్‌లో ఈ రేసును నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌1 తెలిపింది. ఎర్ర సముద్రానికి సమాంతరంగా ఉండే ఈ ట్రాక్‌ చూపరులకు కనువిందు చేస్తుందని వెల్లడించింది.

‘ఎఫ్‌1 సీజన్‌లోకి సౌదీ అరేబియాను ఆహ్వానిస్తున్నాం’ అని ఎఫ్‌1 సీఈవో చేస్‌ క్యారీ వ్యాఖ్యానించారు. గల్ఫ్‌ దేశాల్లో బహ్రెయిన్, అబుదాబిలు ఇప్పటికే ఎఫ్‌1 సీజన్‌ల్లో ఏటా రేస్‌లకు ఆతిథ్యమిస్తూ వస్తున్నాయి. సౌదీ రాజధాని రియాద్‌లో 2030 నాటికి ఫార్ములా వన్‌ రేసును నిర్వహించేలా... ట్రాక్‌ను కూడా నిర్మిస్తున్నారు. 2021 ఎఫ్‌1 సీజన్‌ క్యాలెండర్‌ పూర్తయిందని... త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తామని క్యారీ తెలిపారు. సౌదీ దేశంలో ఉండే తీవ్ర ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ రేస్‌ను రాత్రి వేళ నిర్వహించే ప్రతిపాదన కూడా ఉంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా