Max Verstappen: 'స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌

26 Apr, 2022 12:48 IST|Sakshi
మాక్స్‌ వెర్‌స్టాపెన్‌

ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ప్రతిష్టాత్మక లారెస్‌ స్పోర్ట్‌ 2022 అవార్డు గెలుచుకున్నాడు. మెన్స్‌ విభాగంలో వెర్‌స్టాపెన్‌.. ''వరల్డ్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'' అవార్డు దక్కించుకున్నాడు. క్రికెటేతర క్రీడల నుంచి అవార్డు అందుకున్న జాబితాలో వెర్‌స్టాపెన్‌ నిలిచాడు. టైగర్‌వుడ్స్‌, రోజర్‌ ఫెదరర్‌, ఉసెన్‌ బోల్ట్‌ లాంటి దిగ్గజాల సరసన నిలిచిన వెర్‌స్టాపెన్‌ ఫార్ములా వన్‌ నుంచి ఈ ఘనత అందుకున్న నాలుగో రేసర్‌గా నిలిచాడు.

ఇంతకముందు లూయిస్‌ హామిల్టన్‌, సెబాస్టియన్‌ వెటెల్‌, మైకెల్‌ షుమాకర్‌లు లారెస్‌ స్పోర్ట్స్‌ అవార్డును గెలుచుకున్నారు. ఇక మహిళల విభాగంలో జమైకన్‌ స్ప్రింటర్‌ ఎలైన్‌ థాంప్సన్‌ హెరా.. ''లారెస్‌ స్పోర్ట్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు''ను దక్కించు​కుంది. ఈమె టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ విభాగంలో మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టింది. టెన్నిస్‌ స్టార్‌ ఎమ్మా రాడుకాను.. ''బ్రేక్‌ త్రూ ఆఫ్‌ ది ఇయర్‌'' పురస్కారాన్ని సాధించింది. ఇక ఇటలీ పరుషుల ఫుట్‌బాల్‌ జట్టు ''వరల్డ్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌''గా ఎంపికైంది.


ఎలైన్‌ థాంప్సన్‌ హెరా, జమైకన్‌ స్ప్రింటర్‌

కాగా ఆదివారం(ఏప్రిల్‌ 24న) ఇటలీలో జరిగిన ఎమిలియా రొమానా గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. 63 ల్యాప్‌ల రేసును పోల్‌ పొజిషన్‌తో ప్రారంభించిన వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా గంటా 32 నిమిషాల 07.986 సెకన్లలో ముగించి కెరీర్‌లో 22వ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 

చదవండి: అందరి దృష్టి సింధు, లక్ష్యసేన్‌ పైనే

Sakshi Dhoni: జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ధోని భార్య

మరిన్ని వార్తలు