హైదరాబాద్‌ నుంచి రేసింగ్‌ పోటీలు తరలింపు

1 Nov, 2023 07:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా నగరంలో జరగాల్సిన రెండు రేసింగ్‌ పోటీలు రద్దయ్యాయి. ఈ నెల 4, 5 తేదీల్లో నెక్లెస్‌ రోడ్‌ వేదికగా ఎఫ్‌4 ఇండియన్‌ చాంపియన్‌షిప్, ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ నిర్వహించాల్సి ఉంది. అయితే ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలతో వీటిని ఇక్కడ జరపడం లేదని నిర్వాహకులు ప్రకటించారు.

ఈ రెండు రేస్‌లను హైదరాబాద్‌నుంచి తరలిస్తున్నామని, ప్రకటించిన ఆ రెండు తేదీల్లోనే చెన్నైలో నిర్వహిస్తామని వారు వెల్లడించారు. రేస్‌ల కోసం ఇప్పటికే టికెట్లు కొన్నవారికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామన్నారు.    

మరిన్ని వార్తలు