Sanjay Manjrekar: 'విరాట్‌ కోహ్లి కంటే డుప్లెసిస్ అత్యుత్తమ కెప్టెన్‌'

28 May, 2022 16:37 IST|Sakshi
PC: IPL.COM

ఐపీఎల్‌-2022లో భాగంగా శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్‌-2లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి చెందిన ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా ఈ సీజన్‌లోనైనా కప్‌ సాధిస్తుందని భావించిన ఆర్సీబీ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇది ఇలా ఉండగా.. గతేడాది సీజన్‌ కంటే ఈ ఏడాది సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి కంటే ఫాఫ్ డుప్లెసిస్ అత్యుత్తమంగా రాణించాడని మంజ్రేకర్ తెలిపాడు.

"ఆర్సీబీ గత సీజన్‌ కంటే ప్రస్తుత సీజన్‌లో మెరుగ్గా రాణించింది. విరాట్‌ కోహ్లి కంటే డుప్లెసిస్ అత్యత్తుమ సారథిగా కన్పిస్తున్నాడు. కాగా వారిద్దరి నుంచి మరింత మంచి ఇన్నింగ్స్‌లు ఆశించాం. అయితే ప్లే ఆఫ్స్‌కు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా టైటిల్‌ సాధిస్తారని భావించాను. అయితే క్వాలిఫైయర్‌-2లో ఓటమి గల కారణాలు వాళ్లకు బాగా తెలుసు. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ బౌలర్లు అద్బుతంగా రాణించారు. అయితే బౌలర్లను సరైన సమయాల్లో డుప్లెసిస్ ఉపయోగించాడు. ఇక అతడు బ్యాటింగ్‌ పరంగా టోర్నీ ఆరంభంలో అద్భుతంగా రాణించనప్పటికీ.. అందరూ బ్యాటర్ల మాదిరిగానే సెకెండ్‌ హాఫ్‌లో కాస్త తడబడ్డాడు. అయినప్పటికీ కెప్టెన్‌గా మాత్రం డుప్లెసిస్ సరైన ఎంపిక" అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022: 'ఓవైపు తల్లికి సీరియస్‌.. అయినా మ్యాచ్‌లో అదరగొట్టాడు'

Poll
Loading...
మరిన్ని వార్తలు