ఆస్పత్రి పాలైన డుప్లెసిస్‌

13 Jun, 2021 09:57 IST|Sakshi

అబుదాబి: దక్షిణాఫ్రికా సీనియర్‌ ఆటగాడు ఫాఫ్‌ డు ప్లెసిస్‌ గాయపడ్డాడు. బౌండరీ లైన్‌ దగ్గర మరో ఆటగాడిని గట్టిగా ఢీ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. అబుదాబి షేక్‌ జాయెద్‌ స్టేడియంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో డు ప్లెసిస్‌ కళ్లు తిరిగి పడిపోగా.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. 

పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌ టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌, పెషావర్‌ జల్మి జట్ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బంతిని బౌండరీ వద్ద డైవ్‌చేసి అడ్డుకునే క్రమంలో మరో ఆటగాడు మహమ్మద్‌ హస్‌నెయిన్‌ను ఢీ కొట్టాడు. హసనెయిన్‌ మోకాలి చిప్ప బలంగా తాకడంతో డు ప్లెసిస్‌ కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అందరిలో టెన్షన్‌ నెలకొంది. ఆ వెంటనే వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. 

డు ప్లెసిస్‌ గాయపడ్డ సంగతి తెలిసిన అభిమానులు.. అతను త్వరగా కోలుకోవాలంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయిన డు ప్లెసిస్‌.. తిరిగి హోటల్‌ రూమ్‌కి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో డు ప్లెసిస్‌ జట్టు క్వెట్టా గ్లాడియేటర్స్‌ ఓటమి పాలైంది. ఇక శనివారమే డెన్మార్క్‌ ఫిన్లాండ్‌ ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా క్రిస్టియన్‌ ఎరిక్‌సెన్‌ మైదానంలోనే కుప్పకూలి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.

చదవండి: కుప్పకూలిన ఫుట్‌బాల్‌ ప్లేయర్

మరిన్ని వార్తలు