అవార్డుతో పాటు అభిమానుల మనసు గెలుచుకున్నాడు

4 Oct, 2021 18:54 IST|Sakshi

Faheem Ashraf Won Fan Hearts.. పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఫహీమ్‌ అశ్రఫ్‌ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు దాహంతో ఇబ్బందిపడుతున్న వేళ వాటర్‌ బాటిల్‌ను అందించి తన ఉదారతను చాటుకున్నాడు. నేషనల్‌ టి20 కప్‌లో భాగంగా సదరన్‌ పంజాబ్‌, సెంట్రల్‌ పంజాబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. టాస్‌ గెలిచిన సెంట్రల్‌ పంజాబ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కాగా బౌండరీలైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ఫహీమ్‌ అశ్రఫ్‌ను కొంతమంది అభిమానులు పిలిచారు.

ఫహీమ్‌ వెనక్కి తిరిగి చూడగానే ఆ గుంపులో ఒకడు దాహంగా ఉందని.. తాగేందుకు వాటర్‌ బాలిల్‌ ఇవ్వాలని కోరాడు. వెంటనే ఫహీమ్‌ స్టాండ్స్‌ దగ్గరకు వచ్చి తన దగ్గరున్న వాటర్‌బాటిల్‌ను వారి మధ్యకు విసిరాడు. అనంతరం తమకు సాయం చేసినందుకు ఫహీమ్‌కు థ్యాంక్స్‌ చెబుతూ గట్టిగట్టిగా అరిచారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూట్‌లో ట్రెండింగ్‌గా మారింది.

ఇక మ్యాచ్‌లో సెంట్రల్‌ పంజాబ్‌ను విజయం వరించింది. 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్‌ పంజాబ్‌ 19 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఫహీమ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును కూడా గెలుచుకోవడం విశేషం. ఇక ఫహీమ్‌ అశ్రఫ్‌ పాకిస్తాన్‌ తరపున 11 టెస్టుల్లో 594 పరుగులు.. 31 వన్డేల్లో 218 పరుగులు.. 42 టి20ల్లో 259 పరుగులు సాధించాడు.

చదవండి: టీ20ల్లో చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజమ్‌.. గేల్‌, కోహ్లి రికార్డులు బద్దలు 

Sehwag- SRH: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా'

మరిన్ని వార్తలు