Virat Kohli: ఓటమితో ఆరంభించి.. 'ఓటమి'తో ముగించినా.. లవ్‌ యూ భాయ్‌!

9 Nov, 2021 11:18 IST|Sakshi
Virat Kohli(PC: BCCI)

An Emotional Heartfelt Message to Virat Kohli:


ప్రియమైన విరాట్‌ కోహ్లి...
ధన్యవాదాలు... ఎంఎస్‌ ధోని వారసుడిగా 
నాడు టీమిండియా ‘భారమైన’ పగ్గాలు చేపట్టినందుకు..

ధన్యవాదాలు.. మరో ‘ధోని’ అని ముద్ర వేసినా 
చిరునవ్వుతో ఆ ట్యాగ్‌ను స్వీకరించినందుకు..

ధన్యవాదాలు... నీ దూకుడుతో ఆటకు సరికొత్త భాష్యం చెప్పినందుకు
ఎన్నెన్నో విజయాలు అందించినందుకు..

ధన్యవాదాలు.. రన్‌మెషీన్‌ అంటూ పొగిడిన మేమే 
ఓటములు ఎదురైనపుడు నిన్ను మా మాటలతో అవమానించినా లెక్క చేయనందుకు..

ధన్యవాదాలు... నీ రికార్డులు చూసి పొంగిపోయిన మేమే..
దాయాది చేతిలో రెండుసార్లు ఘోర పరాభవం తట్టుకోలేక 
నీ కుటుంబాన్ని సైతం విమర్శించినా మమ్మల్ని క్షమించినందుకు..

ధన్యవాదాలు... దేశం కోసం.. జాతి కోసం 
అంకితభావంతో నీ బాధ్యతలు చక్కగా నెరవేరుస్తున్నందుకు..

ధన్యవాదాలు... తండ్రి మరణం గురించి తెలిసినా
బాధను దిగమింగి జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించగల పరిపక్వత కలిగి ఉన్నందుకు

ధన్యవాదాలు... సచిన్‌ టెండుల్కర్‌ రికార్డులు అధిగమించగల
ఆటగాడు పుట్టలేడన్న మా అంచనాలు తలకిందులు చేసినందుకు..
అలా కూడా మాకు ఆనందం పంచినందుకు..

ధన్యవాదాలు.. ఉత్తమ్‌నగర్‌లో పెరిగిన ఓ అబ్బాయీ
దేశాన్ని గర్వపడేలా చేసినందుకు..
ప్రపంచ క్రికెట్‌లో మన స్థాయిని మరో మెట్టుకు తీసుకువెళ్లినందుకు..

ధన్యవాదాలు.. ఇన్నాళ్లు టీ20 కెప్టెన్‌గా నీ పాత్రను సమర్థవంతంగా పోషించినందుకు
ఓటమితో ఆరంభించి.. ఓటమితో ముగించినా పొట్టి ఫార్మాట్‌లో నీదైన ముద్ర వేసినందుకు..

50 టీ20 మ్యాచ్‌లు.. 32 విజయాలు.. 16 ఓటములు.. ట్రోఫీ గెలవలేకపోయావేమో గానీ మా మనసులు మాత్రం గెలిచావు.. నువ్వెప్పుడూ మాకు ‘కింగ్‌’వే..!! ఎల్లప్పుడూ మా ఆరాధ్య క్రికెటర్‌వే!! లవ్‌ యూ భాయ్‌!!

-సుష్మారెడ్డి యాళ్ల(సాక్షి వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం)

చదవండి: Virat Kohli: అందరికీ థాంక్స్‌.. ఆరోజే గనుక వస్తే క్రికెట్‌ ఆడటం మానేస్తాను.. కోహ్లి ఉద్వేగం

2017లో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన విరాట్‌ కోహ్లి
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో సారథిగా ప్రయాణం మొదలు
కెప్టెన్‌గా కాన్పూర్‌లో ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమి
టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో నమీబియాతో కెప్టెన్‌గా కోహ్లి చివరి మ్యాచ్‌
ఓటమితో కెప్టెన్సీని ఆరంభించి.. మేజర్‌ టోర్నీలో ట్రోఫీ గెలవలేక ‘ఓటమి’ తోనే ముగించిన కోహ్లి
టీ20 ప్రపంచకప్‌ గెలవాలన్న కోరిక తీరకుండానే సారథిగా నిష్క్రమణ

చదవండి: Ravi Shastri: రవిశాస్త్రి భావోద్వేగం.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా అతడి రికార్డులు ఇవే!

 
 

Poll
Loading...
మరిన్ని వార్తలు