David Warner: ప్రపంచంలో ఏ బౌలర్‌కు సాధ్యం కాని ‘ఘనత’! ఆడేసుకుంటున్న నెటిజన్లు

27 Dec, 2022 12:54 IST|Sakshi
భార్య, పిల్లలతో డేవిడ్‌ వార్నర్‌ (PC: David Warner Instagram)

Australia vs South Africa, 2nd Test- David Warner: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ సాధించి.. ఆపై దానిని ద్విశతకంగా మలిచిన అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా వార్నర్‌ ద్విశతకం సాధించాడు.

ఈ నేపథ్యంలో వార్నర్‌ భార్య కాండిస్‌ సైతం ఆనందంలో తేలిపోతోంది. భర్త ఆట తీరు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆమె.. విమర్శకులకు చురకలు అంటించింది. ఇప్పటికైనా వార్నర్‌కు దూరంగా ఉండాలని... అతడిని ఒక మాట అనాలంటే ఆలోచించుకోవాలనే ఉద్దేశంలో కామెంట్లు చేసింది. 

వామ్మో అన్ని వేల వికెట్లా!?
ఇక డబుల్‌ సెంచరీ హీరో వార్నర్‌ పేరు సోషల్‌ మీడియాలో మారుమోగుతున్న వేళ.. ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ బ్రాడ్‌కాస్టర్‌ ఫాక్స్ స్పోర్ట్స్ చేసిన తప్పిదం కూడా వైరల్‌గా మారింది. వార్నర్‌ సుదీర్ఘ కెరీర్‌లో గణాంకాలు కోట్‌ చేస్తూ.. పరుగుల స్థానంలో వికెట్లు అని గ్రాఫిక్‌ను డిస్‌ప్లే చేసింది.

ఇక ముందు కూడా ఎవరూ ఉండరు!
ఈ మేరకు 100 టెస్టుల్లో 7922 వికెట్లు, 141 వన్డేల్లో 6007 వికెట్లు, 99 టీ20లలో 2894 వికెట్లు అని చూపించింది. ఈ విషయాన్ని పసిగట్టిన నెటిజన్లు స్క్రీన్‌షాట్లు తీసి.. బ్రాడ్‌కాస్టర్‌ తీరుపై సైటైర్లు వేస్తున్నారు. ‘‘దాదాపు 16 వేల వికెట్లు.. క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి బౌలర్‌ లేడు. ఇక ముందు రాబోడు.

ఈ లెక్కన ఒక్క మ్యాచ్‌లో వార్నర్‌ 79 వికెట్లు తీశాడా? ఇంతకంటే గొప్ప విషయం ఏమీ ఉండదు. 1400 హండ్రెడ్‌ వికెట్‌ హాల్‌.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిట్టి రోబోకైనా ఇది సాధ్యమవుతుందా? అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. కాగా 200 పరుగుల మార్కును అందుకున్న తర్వాత వార్నర్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

చదవండి: Babar Azam: పాంటింగ్‌ రికార్డు బద్దలు కొట్టిన బాబర్‌ ఆజం! సెహ్వాగ్‌లా అలా!
IPL 2023: అన్న త్యాగం వల్లే ఇలా కోటీశ్వరుడిగా.. నాన్నను మిస్‌ అవుతున్నా! వాళ్లతో కలిసి ఆడతా

మరిన్ని వార్తలు