Virat Kohli: 'కోహ్లి నోరు తెరిస్తే బూతులే': మాజీ క్రికెటర్‌

19 Aug, 2021 13:47 IST|Sakshi
నిక్‌ కాంప్టన్‌, విరాట్‌ కోహ్లి

లండన్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి కోపం ఎక్కువనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాధ వచ్చినా.. సంతోషం కలిగినా కోహ్లిని ఆపడం ఎవరి వల్ల కాదు. తాజాగా లార్డ్స్‌ టెస్టు విజయం తర్వాత కోహ్లి చేసిన సంబరాలు సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌ అయ్యాయి. అయితే ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు నిక్‌ కాంప్టన్‌ కోహ్లిని తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు  అతని మెడకే చుట్టుకునేలా చేశాయి.  ''కోహ్లి నోరు తెరిస్తే బూతులే వస్తాయంటూ'' ట్విటర్‌ వేదికగా కాంప్టన్‌ తెలిపాడు. 
చదవండి: 'పిచ్‌ నీ సొంతం కాదు.. పరిగెత్తడానికి' అండర్సన్‌కు కోహ్లి వార్నింగ్‌

''కోహ్లి నోరు తెరిస్తే అతని నోటి నుంచి బూతులే ఎక్కువగా వస్తాయి. 2012లో కోహ్లి నన్ను వేలెత్తి చూపుతూ చేసిన దూషణను నేను మర్చిపోలేదు. ఆ సమయంలో కోహ్లి అలా చేసి తనను తాను తక్కువ చేసుకున్నాడు. కోహ్లి చర్యలతో పోలిస్తే.. జో రూట్‌, సచిన్‌ టెండూల్కర్‌, కేన్‌ విలియమ్సన్‌ ఎంత హుందాగా ఉంటారో తెలుస్తోంది. అంటూ నిక్‌ కాంప్టన్‌ ట్వీట్‌ చేశాడు. కాంప్టన్‌ వ్యాఖ్యలపై కోహ్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో దెబ్బకు ట్వీట్‌ను తొలగించాల్సి వచ్చింది. 


నిక్‌ కాంప్టన్‌ ట్వీట్‌ తొలగించకముందు

''నిక్‌ కాంప్టన్‌..  నీకు సిగ్గుండాలి ఇలా మాట్లాడడానికి..  అండర్సన్‌ అశ్విన్‌ను అవమానించినప్పుడు.. అలాగే వీడ్కోలు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఫిలాండర్‌ను బట్లర్‌ దూషించినప్పుడు నువ్వెక్కడున్నావు..'' .. '' లార్డ్స్‌ టెస్టులో  బుమ్రా ఒక ఓవర్‌ అండర్సన్‌కు ప్రమాదకరంగా వేసిన మాట నిజమే.. కానీ అది మనసులో పెట్టుకొని బుమ్రా బ్యాటింగ్‌ దిగినప్పుడు అతన్ని టార్గెట్‌ చేయడం కరెక్టేనా..''.. '' బుమ్రాతో మీరు ప్రవర్తించిన తీరుపై మీ జట్టు మాజీ ఆటగాళ్లతో పాటు షేన్‌ వార్న్‌ లాంటి వారు కూడా తప్పుబట్టారు. కోహ్లి మ్యాచ్‌ గెలిచామన్న సంతోషంలో అలా చేశాడే తప్ప అతని మనుసులో ఏం లేదు.. అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: ఎవరు చెప్పినా వినలేదు.. అదే మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌

మరిన్ని వార్తలు