భారత్‌, ఆసీస్‌ తొలి వన్డే.. రణరంగంగా ఆజాద్‌ మైదాన్‌

17 Mar, 2023 16:22 IST|Sakshi

ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్‌ ప్రశాంతంగా సాగుతున్నప్పటికి.. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మాత్రం ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌ రణరంగాన్ని తలపించింది. మ్యాచ్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాన్ని ఆజాద్‌ మైదానంలోనే ఏర్పాటు చేశారు.

కరోనా తదనంతరం పరిస్థితులు మారడంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎక్కువగా ఆన్‌లైన్‌ టికెట్స్‌వైపే మొగ్గుచూపారు. అయితే నిర్వాహకులు ఒకటే కౌంటర్‌ ఏర్పాటు చేయడం.. అభిమానులు మాత్రం ఊహించనిస్థాయిలో వచ్చారు. టికెట్ల కోసం క్యూలో నిలబడినప్పటికి రెండు గంటలకు పైగా కౌంటర్‌ తెరవలేదు.

దీంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టికెట్‌ కౌంటర్‌ కిటికీ గ్రిల్‌ను ఊడగొట్టి విధ్వంసం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అభిమానులను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో పలువురిపై లాఠాచార్జీ చేశారు. అయితే కాసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి తెచ్చిన పోలీసులు క్యూలో నిల్చున్నవారికి మ్యాచ్‌ టికెట్లు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

చదవండి: జడేజాతో అట్లుంటది మరి.. డైవ్‌ చేస్తూ సంచలన క్యాచ్‌! వీడియో వైరల్‌

Rajinikanth: అభిమానం స్టేడియానికి రప్పించిన వేళ..

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు