FIFA WC 2022: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా?

8 Dec, 2022 17:40 IST|Sakshi

ఖతర్‌ వేదికగా ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే గ్రూప్‌ దశతో పాటు రౌండ్‌ ఆఫ్‌ 16 మ్యాచ్‌లు ముగిశాయి. శుక్రవారం నుంచి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. అరబ్‌ గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌ను లైవ్‌లో వీక్షించేందుకు దాదాపు కోటికి పైగా వెళ్లారు. లైవ్‌ చూడలేని వాళ్లు మాత్రం టీవీల్లో, జియో సినిమాలో, తమకు నచ్చిన ఫ్లాట్‌ఫాంలో చూస్తూ ఆనందిస్తున్నారు.

తాజాగా యూట్యూబ్‌ మాత్రం ఫిఫా అభిమానులను దారుణంగా మోసం చేసింది. ఫిఫా వరల్డ్‌కప్‌ సందర్భంగా గ్రూప్‌ దశలో జపాన్‌, జర్మనీ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ రీప్లేను యూట్యూబ్‌లో టెలికాస్ట్‌ చేశారు. రియల్‌ మ్యాచ్‌ అనుకొని ఎంజాయ్‌ చేసిన అభిమానులకు ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. ఆ ట్విస్ట్‌ ఏంటంటే.. అది రియల్‌ మ్యాచ్‌ కాదు ఫేక్‌ గేమ్‌ అని. ఫిఫా 23 గేమ్‌ప్లే(ఆన్‌లైన్‌ గేమ్‌)లో భాగంగా ఒక గేమింగ్‌ కంపెనీ దీనిని రూపొందించింది.

మాములుగా యూట్యూబ్‌లో మనం ఏదైనా మ్యాచ్‌ వీక్షిస్తే.. ఒరిజినల్‌కు, డూప్లికేట్‌కు తేడా ఇట్టే తెలిసిపోతుంది. కానీ సదరు యూట్యూబ్‌ చానెల్‌ మాత్రం మ్యాచ్‌ రెజల్యూషన్‌(క్వాలిటీ) తగ్గించి గేమింగ్‌ను కాస్త రియల్‌ గేమ్‌లాగా చూపించారు. దూరం నుంచి చూస్తే మాత్రం అచ్చం రియల్‌ మ్యాచ్‌లానే కనిపిస్తోంది. కాస్త దగ్గరి నుంచి పరిశీలిస్తే కానీ అది బొమ్మల గేమ్‌ అని అర్థమవుతుంది. అంత మాయ చేశారు యూట్యూబ్‌ నిర్వాహకులు.

అయితే నిజంగానే జపాన్‌, జర్మనీలు ఒకే గ్రూప్‌లో ఉండడంతో ఎవరికి అనుమానం రాలేదు. చిత్రమైన విషయం ఏంటంటే.. ఫేక్‌ మ్యాచ్‌ను ఒరిజినల్‌ అనుకొని దాదాపు 40వేల మంది వీక్షించారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు చాంపియన్‌ అయిన జర్మనీ గ్రూప్‌ దశలో వెనుదిరగ్గా.. జపాన్‌ ప్రీక్వార్టర్స్‌లో ఇంటిబాట పట్టింది.

చదవండి: ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ ఫుట్‌బాలర్‌

పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం!

మరిన్ని వార్తలు