T20 WC IND Vs BAN: ఓడినా వణికించిన బంగ్లాదేశ్‌

2 Nov, 2022 18:02 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో విజయం అందుకుంది. సూపర్‌-12లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో కేవలం ఐదు పరుగులు తేడాతో విజయం సాధించింది. అయితే బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఓడినా టీమిండియాను మాత్రం వణికించింది. ముఖ్యంగా బంగ్లా ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ మెరుపు ఇన్నిం‍గ్స్‌తో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించాడు.

185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు లిటన్‌దాస్‌ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. కేవలం 21 బంతుల్లో అర్థసెంచరీ మార్క్‌ అందుకున్న లిటన్‌ దాస్‌.. ఆ తర్వాత కూడా జోరు చూపించాడు. అతని జోరుకు బంగ్లా సులువుగా విజయం సాధించేలా కనిపించింది. ఈలోగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో కాసేపు ఆటను నిలిపివేశారు. అయితే అప్పటికే చేయాల్సిన స్కోరు కన్నా బంగ్లాదేశ్‌ 17 పరుగులు ఎక్కువ చేసింది. వర్షం తగ్గకుండా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి అమలైతే మాత్రం బంగ్లాదేశ్‌ విజేతగా నిలిచేది.

అయితే వరుణుడు శాంతించడంతో మ్యాచ్‌ మళ్లీ మొదలైంది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో బంగ్లాదేశ్‌ ముందు 9 ఓవర్లలో 85 పరుగులు చేయాలి. టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లా దూకుడు మంత్రాన్ని మాత్రం వదల్లేదు. అయితే అనూహ్యంగా లిటన్‌ దాస్‌ రనౌట్‌ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది.  ఆ తర్వాత వచ్చిన బంగ్లా బ్యాటర్స్‌ కూడా దాటిగా ఆడడంతో ఏ దశలోనే బంగ్లా వెనక్కి తగ్గేలా కనిపించలేదు. అయితే మధ్యలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.

ఆఖర్లో నురుల్‌ హసన్(25 నాటౌట్‌), తస్కిన్‌ అహ్మద్‌(12 నాటౌట్‌) చెలరేగడంతో టీమిండియా ఓటమిపై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సిన దశలో అర్ష్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. అలా టీమిండియా విజయం సాధించినప్పటికి బౌలింగ్‌ లోపాలు మాత్రం మరోసారి స్పష్టంగా కనిపించాయి. ఇక టి20 ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు అందుకున్న టీమిండియా సెమీస్‌ బెర్తు దక్కించుకున్నట్లే. 

చదవండి: పిచ్‌పై పచ్చిక.. బంగ్లా ఓపెనర్‌ కొంపముంచింది

Poll
Loading...

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు