Prithvi Shaw: 'ఏం ఆడుతున్నావని విమర్శించారు'.. బ్యాట్‌తోనే సమాధానం

7 Apr, 2022 20:20 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా తొలిసారి మెరిశాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో పృథ్వీ తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించాడు. ఆరంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్‌ చేసిన పృథ్వీ షా ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లోనే 7 ఫోర్లు , ఒక సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. ఆ తర్వాత ఒక ఫోర్‌, మరో సిక్స్‌ బాదిన పృథ్వీ 34 బంతుల్లో 61 పరుగుల చేసి కృష్ణప్ప గౌతమ్‌ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ బౌండరీలు బాదిన పృథ్వీ.. ఆవేశ్‌ ఖాన్‌కు చుక్కలు చూపించాడు. 

మధ్యలో ఇన్నింగ్స్‌ 6 ఓవర్లో ఆండ్రూ టై వేసిన ఒక బంతి పృథ్వీ షా పొత్తి కడుపు కింద బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పృథ్వీ నొప్పిని బరిస్తూనే బ్యాటింగ్‌ కొనసాగించాడు. కాగా పృథ్వీ ఇన్నింగ్స్‌పై అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. '' ఏం ఆడుతున్నావని విమర్శించినవారికి పృథ్వీ షా తన బ్యాటింగ్‌తోనే సమాధానమిచ్చాడు.'' అంటూ కామెంట్‌ చేశారు.

పృథ్వీ షా మెరుపు ఇన్నింగ్స్‌ కోసం క్లిక్‌ చేయండి

చదవండి: Nari Contractor: టీమిండియా మాజీ కెప్టెన్‌ తలలో మెటల్‌ ప్లేట్‌.. 60 ఏళ్ల తర్వాత తొలగింపు!

Deepak Hooda-Krunal Pandya: 'ఒకప్పుడు కొట్టుకునే స్థాయికి'.. కట్‌చేస్తే

మరిన్ని వార్తలు