Asia Cup 2022: 'కింగ్‌ కోహ్లి వేట మొదలైంది.. ఇక ఏ జట్టుకైనా చుక్కలే'

4 Sep, 2022 22:37 IST|Sakshi

ఆసియాకప్‌-2022లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అదరగొడుతున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా కోహ్లి వరుసగా రెండో ఆర్ధసెంచరీ సాధించాడు. హాంగ్‌కాంగ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో మెరిసిన కింగ్‌.. పాకిస్తాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లోనూ తన బ్యాట్‌ను ఝుళిపించాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లో 60 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

అతడు ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు ఒక సిక్స్‌ ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 154 పరుగులతో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కాగా గత కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లి తిరిగి తన రిథమ్‌ను పొందడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమాన క్రికెటర్‌పై ప్రశంసల వర్షం‍ కురిపిస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. 'కింగ్‌ కోహ్లి వేట మొదలైంది.. ఇక ఏ జట్టుకైనా చుక్కలే' అంటూ కామెంట్‌ చేశాడు.


చదవండి: Asia Cup 2022: పాక్‌పై టీమిండియా సరికొత్త చరిత్ర.. 10 ఏళ్ల తర్వాత!

మరిన్ని వార్తలు