Rohit-Ravi Bishnoi: రోహిత్‌ ఆగ్రహానికి గురైన రవి బిష్ణోయ్‌.. తొలి మ్యాచ్‌ కదా వదిలేయ్‌

17 Feb, 2022 08:44 IST|Sakshi

వెస్టిండీస్‌తో తొలి టి20 మ్యాచ్‌ ద్వారా లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన బిష్ణోయి 4 ఓవర్లలో 17 డాట్‌ బాల్స్‌ వేసి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. సూపర్‌ ఎంట్రీతో అదరగొట్టిన బిష్ణోయ్‌ క్యాచ్‌ విషయంలో కాస్త పొరబడడంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో పవర్‌ ప్లేలో యజ్వేంద్ర చహల్‌ బౌలింగ్‌లో తొలి బంతిని నికోలస్‌ పూరన్‌ లాంగ్‌ఆప్‌ భారీ షాట్‌ ఆడాడు. కచ్చితంగా సిక్స్‌ అని మనం అనుకుంటున్న సమయంలో బిష్ణోయ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

చదవండి: IND Vs WI: 'అది వైడ్‌బాల్‌ ఏంటి' రోహిత్‌ అసహనం.. కోహ్లి సలహా

కానీ తనను తాను కంట్రోల్‌ చేసుకునే ప్రయత్నంలో బిష్ణోయ్‌ బౌండరీ లైన్‌ను తాకేశాడు. దీంతో అంపైర్‌ సిక్స్‌గా ప్రకటించాడు. తాను చేసిన తప్పుకు నాలుక కరుచుకుంటూ నిరాశతో బంతిని విసిరేశాడు. ఇది చూసిన రోహిత్‌ శర్మ బిష్ణోయ్‌ వైపు కాస్త కోపంతో చూశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక​ లుక్కేయండి. ఈ వీడియో చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌.. '' అతనికి ఇది తొలి మ్యాచ్‌.. వదిలేయ్‌ రోహిత్‌..'' అంటూ కామెంట్‌ చేశారు.

ఇంకో విశేషమేమిటంటే.. చహల్‌ చేతుల మీదుగానే రవి బిష్ణోయ్‌ టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు. తన బౌలింగ్‌లో క్యాచ్ పట్టినప్పటికి పొరపాటున బౌండరీలైన్‌ తాకడంతో చహల్‌ వికెట్‌ తీసే అవకాశాన్ని కోల్పోయాడు. చహల్‌ ఇదేం పట్టించుకోకుండా ఓవర్‌ పూర్తైన తర్వాత బిష్ణోయ్‌ వద్దకు వెళ్లి ''మంచి ప్రయత్నం చేశావు..'' అంటూ మెచ్చుకున్నాడు. టి20 క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా అతను నిలిచాడు.మొదటి మ్యాచ్‌లో సహజంగానే ఉండే ఒత్తిడి వల్ల క్యాచ్‌ అందుకునే క్రమంలో బౌండరీ లైన్‌ను తాకి సిక్స్‌ ఇచ్చిన అతను 6 వైడ్లు వేశాడు. 
చదవండి: Ravi Bishnoi: 24 బంతుల్లో 17 డాట్‌బాల్స్‌.. సూపర్‌ ఎంట్రీ రవి బిష్ణోయి

మరిన్ని వార్తలు