Mohammad Hafeez: టీమిండియాపై పొగడ్తలు.. పాక్‌ క్రికెటర్‌పై భారత్‌ ఫ్యాన్స్‌ తిట్ల దండకం 

3 Sep, 2022 18:41 IST|Sakshi

మాములుగానే భారత్‌-పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఇరుదేశాల అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్లతో రెచ్చిపోతారు. అయితే ఇవన్నీ క్రీడాస్పూర్తి పరిధిలోని ఉంటాయి. తాజాగా టీమిండియాపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ హఫీజ్‌ పొగడ్తల వర్షం కురిపించాడు. పొగడ్తలు కురిపించినప్పటికి టీమిండియా ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యాడు. మరి హఫీజ్‌ చేసిన వ్యాఖ్యలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

''నాకు ఎక్కువ విషయాలు తెలియవు. ఒకటి మాత్రం బాగా తెలుసు. సమాజంలో ఎవరు డబ్బు బాగా సంపాదిస్తే వారిని ప్రేమించేవాళ్లు ఎక్కువగా ఉంటారు. ఇది బీసీసీఐకి అక్షరాలా సరిగ్గా తూగుతుంది. ఎందుకంటే టీమిండియాను రెవెన్యూ సృష్టించే దేశం. ప్రపంచంలో ఎక్కడ ద్వైపాక్షిక సిరీస్‌ జరిగినా.. అక్కడ టీమిండియా స్పాన్సర్‌ చేస్తే జాక్‌పాట్‌ కొట్టినట్లే. ఇలాంటి విషయాలు ఎవరు కాదనలేరు. అందుకే టీమిండియాను ''లాడ్లాస్‌''గా అభివర్ణిస్తా. ఎందుకంటే సంపదను వృద్ధి చేయడంలో బీసీసీఐకి ఎవరు సాటి రారు అని చెప్పుకొచ్చాడు. 

మహ్మద్‌ హఫీజ్‌ కోణంలో వినడానికి బాగున్నా.. అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది. టీమిండియాను పొగిడినప్పటికి భారత్‌ అభిమానులు అతనిపై తిట్ల దండకం అందుకున్నారు. '' బీసీసీఐ సంపన్న బోర్డు అని చెప్పుకొచ్చాడు.. కానీ టీమిండియా ఆడిన క్రికెట్‌ గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. అంటే టీమిండియా మంచి క్రికెట్‌ ఆడకున్నా బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తుందా.. టీమిండియా మంచి క్రికెట్‌ ఆడుతుంది కాబట్టే బీసీసీఐకి డబ్బులు వస్తున్నాయి.

1983లో టీమిండియా ప్రపంచకప్‌ గెలిచిన తర్వాతే బీసీసీఐ అనే పేరు వినిపించింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ సంపన్న బోర్డుగా అవతరించింది. మరి దీని వెనుక ఉన్న కారణం.. ఇన్నేళ్లలో టీమిండియా మంచి క్రికెట్‌ ఆడడమే కదా. బీసీసీఐని సంపన్న బోర్డు అంటూనే టీమిండియాను తక్కువ చేసి మాట్లాడాడంటూ'' అభిమానులు గరం అయ్యారు.

ఇక ఆసియాకప్‌లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్‌లు ఆదివారం(సెప్టెంబర్‌ 4న) మరోసారి తలపడనున్నాయి. సూపర్‌-4లో భాగంగా జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా మరో విజయం సాధిస్తుందా లేక పాక్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా అన్నది చూడాలి. కాగా లీగ్‌ దశలో పాకిస్తాన్‌ను టీమిండియా 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.

చదవండి: Asia Cup 2022 Super 4: పాక్‌తో మ్యాచ్‌.. మూడు మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా..!

AUS Vs ZIM: టీమిండియాపై చేయలేనిది ఆసీస్‌తో చేసి చూపించారు

మరిన్ని వార్తలు