Chris Jordan: ఒకసారి అంటే పర్లేదు.. రెండోసారి కూడా అదే తప్పు

13 Nov, 2022 16:15 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ మధ్య ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ చర్య నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ జోర్డాన్‌ వేశాడు. ఆ ఓవర్‌లో జోర్డాన్‌ వేసిన నాలుగో బంతిని మహ్మద్‌ వసీమ్‌ కట్‌షాట్‌ ఆడగా నేరుగా హ్యారీబ్రూక్‌ చేతుల్లోకి వెళ్లింది. బ్రూక్‌ క్యాచ్‌ పట్టుంటే మాత్రం టోర్నీలో మరొక బెస్ట్‌ క్యాచ్‌ నమోదయ్యేది.

కానీ ఆఖరి నిమిషంలో బ్రూక్‌ బంతిని కింద పెట్టేశాడు. అప్పటికే మహ్మద్‌ వసీమ్‌ సింగిల్‌ తీసే ప్రయత్నం చేశాడు. అయితే బ్రూక్‌ బంతి విసరగా అందుకున్న జోర్డాన్‌ త్రో వేయడంలో విఫలమయ్యాడు. అలా బంతి మరోసారి పరుగులు పెట్టింది. స్టోక్స్‌ త్రో వేయగా.. ఈసారి కూడా జోర్డాన్‌ వికెట్లకు బంతిని వేయడంలో విఫలమయ్యాడు. అలా జోర్డాన్‌ చేసిన పనికి పాక్‌కు మూడు పరుగులు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది.   

ఇక టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బ్యాటింగ్‌లో ఘోరంగా తడబడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పాక్‌ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. దీంతో పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్‌ ఆజం 32, షాన్‌ మసూద్‌ 38 పరుగులు చేశారు.

చదవండి: T20 WC Final: ఇంగ్లండ్‌, పాక్‌ ఫైనల్‌.. ఆకట్టుకున్న 13 ఏళ్ల జానకి ఈశ్వర్‌

>
మరిన్ని వార్తలు