Kohli Golden Duck: మేము చూస్తున్నది కోహ్లిని కాదు.. ఇంకెవరో!

24 Apr, 2022 09:20 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో విరాట్‌ కోహ్లి వైఫల్యం కొనసాగుతూనే ఉంది. శనివారం రాత్రి ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. మార్కో​జాన్సెన్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తద్వారా సీజన్‌లో రెండో గోల్డెన్‌ డక్‌ నమోదు చేసిన కోహ్లి.. ఓవరాల్‌గా ఐదుసార్లు గోల్డెన్‌ డక్‌ అయిన కోహ్లి.. మరో మూడుసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంకో విషయమేంటంటే.. ఆర్‌సీబీకి కలిసిరాని రోజుగా మిగిలపోనున్న ఏప్రిల్‌ 23.. కోహ్లికి కూడా చేదు అనుభవాన్నే మిగిల్చనుంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున(ఏప్రిల్‌ 23, 2017) కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. నాథన్‌ కౌల్టర్‌నీల్‌ బౌలింగ్‌లో మనీష్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత మరోసారి అదే రోజున కోహ్లి గోల్డెన్‌ డక్‌ కావడం యాదృశ్చికమనే చెప్పాలి. ఇక ఆ మ్యాచ్‌లో 49 పరుగులకే కుప్పకూలిన ఆర్‌సీబీ.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరును తమ పేరిట నమోదు చేసింది. 

కోహ్లి ఆటతీరుపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ విమర్శల వర్షం కురిపించారు. మేం చూస్తున్నది కోహ్లిని కాదు.. ఇంకెవరినో.. కోహ్లి ఏమైంది నీకు.. ఈ సీజన్‌ మొత్తం తల కిందకేసి పెవిలియన్‌ చేరుతున్నావు.. మేమెప్పుడు తలెత్తుకునేది.. కోహ్లి మా గుండె ముక్కలవుతుంది.. నిన్నలా చూడలేకపోతున్నాం..అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక కోహ్లి తన కెరీర్‌లోనే అత్యంత చెత్త ఫామ్‌ను చూపిస్తున్నాడు. 2019 నవంబర్‌లో సెంచరీ చేసిన కోహ్లి బ్యాట్‌ నుంచి మరో శతకం జాలువారలేదు. ఈ గ్యాప్‌లో  వంద మ్యాచ్‌లు ఆడినప్పటికి సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. పరుగులు చేయడం పక్కనబెడితే ..ఇప్పుడు గోల్డెన్‌ డక్‌ విషయంలో కోహ్లి పోటీపడుతున్నాడు.  

చదవండి: IPL 2022: ఏప్రిల్‌ 23.. ఆర్‌సీబీకి కలిసిరాని రోజు

మరిన్ని వార్తలు