SL Vs AUS 1st T20I: లంక దారుణ ఆటతీరు.. 28 పరుగుల వ్యవధిలో 

7 Jun, 2022 22:20 IST|Sakshi

ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి టి20లో శ్రీలంక దారుణ ఆటతీరు కనబరిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంక 11.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ దశలో లంక బ్యాటింగ్‌ చూస్తే కచ్చితంగా 200 పరుగుల మార్క్‌ను అందుకుంటుందని భావించారు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. 36 పరుగులు చేసిన పాతుమ్‌ నిస్సాంక స్టార్క్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక్కడి నుంచే లంక పతనం ఆరంభమైంది.

ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన లంక 28 పరుగుల వ్యవధిలో 19.3 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌట్‌ అయింది. టాప్‌ త్రీ బ్యాటర్స్‌ మినహా మిగతా ఏడు మందిలో.. ఆరుగురు బ్యాటర్స్‌ (1,0,0,1,1,1,1) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. వనిందు హసరంగా 17 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 4, మిచెల్‌ స్టార్క్‌ 3, కేన్‌ రిచర్డ్‌సన్‌ ఒక వికెట్‌ తీశాడు.

చదవండి: Ranji Trophy 2022: నమ్మశక్యం కాని క్యాచ్‌.. వీడియో వైరల్‌

Marcus Stoinis: కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌.. ఆ ఒక్క సెంచరీ వెనుక విషాద కథ

మరిన్ని వార్తలు