Trolls On Virat Kohli: ఓపెనర్‌గా వచ్చినా అదే ఆటతీరు.. పక్కన పెట్టాల్సిందేనా!

27 Apr, 2022 08:22 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఆర్‌సీబీ సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి మరోసారి విఫలమయ్యాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో మంగళవారం జరిగిన పోరులో కోహ్లి ఓపెనర్‌గా వచ్చాడు. బ్యాటింగ్‌లో ప్రమోషన్‌ వచ్చినా.. పరుగులు చేయడంలో మాత్రం ఫెయిలయ్యాడు. ఆరంభంలోనే రెండు ఫోర్లు కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు అనిపించినప్పటికి ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో పరాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 9 పరుగులకే కోహ్లి తన ఇన్నింగ్స్‌ను ముగించాడు.

వాస్తవానికి తొలి ఓవర్లో బౌల్ట్‌ బౌలింగ్‌లో డకౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పంచుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన కోహ్లి ప్రసిధ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో షార్ట్‌పిచ్‌ అయిన నాలుగో బంతిని కోహ్లి చూసుకోకుండానే హిట్‌ చేశాడు. ఒక దిక్కు వెళుతుందనుకుంటే.. బ్యాక్‌వర్డ్‌​ పాయింట్‌ దిశగా బంతి వెళ్లింది. పరాగ్‌ ముందుకు డైవ్‌ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. కాగా ఈ సీజన్‌లో కోహ్లి ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు కలిపి 128 పరుగులు మాత్రమే చేశాడు.

కోహ్లి అత్యధిక స్కోరు 47 కాగా.. సీజన్‌లో రెండుసార్లు గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడం విశేషం. కోహ్లి ఆటతీరుపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఓపెనర్‌గా వచ్చిన ఆటతీరు మారలేదు.. ఏ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చినా అదే ఆటతీరు.. పక్కన పెట్టే సమయం ఆసన్నమైంది'' అంటూ కామెంట్స్‌ చేశారు. 

చదవండి: Kohli Golden Duck: మేము చూస్తున్నది కోహ్లిని కాదు.. ఇంకెవరో!

మరిన్ని వార్తలు