PAK Vs AUS: ఏంటి ఫించ్‌.. అఫ్రిది అంటే అంత ఇష్టమా?

6 Apr, 2022 19:20 IST|Sakshi

క్రికెట్‌లో కొన్ని సందర్బాలు అరుదుగా జరుగుతుంటాయి. ఇరుజట్ల మధ్య ఒక సిరీస్‌ లేదా ఏదైనా మేజర్‌ టోర్నీ జరిగినప్పుడు.. సదరు మ్యాచ్‌ల్లో ఒక బ్యాట్స్‌మన్‌ పదేపదే ఒకే బౌలర్‌ చేతిలో ఔటవ్వడం అరుదుగా చూస్తుంటాం. తాజాగా ఆ జాబితాలో ఆరోన్‌ ఫించ్‌- షాహిన్‌ అఫ్రిది చేరిపోయారు. వన్డే సిరీస్‌లో అఫ్రిది.. ఫించ్‌ను రెండుసార్లు ఔట్‌ చేశాడు. తాజాగా ఆ రికార్డును మరోసారి నిలబెట్టుకున్నాడు. మంగళవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో 55 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఆసీస్‌ కెప్టెన్‌ చివరకు అఫ్రిది చేతిలోనే వెనుదిరిగాడు.

దీంతో ఈ సిరీస్‌లో ముచ్చటగా  మూడోసారి ఫించ్‌ అఫ్రిదికే దొరికిపోయాడు. అయితే గతేడాది నవంబర్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఫించ్‌ను తొలిసారి అఫ్రిది గోల్డెన్‌ డక్‌ చేశాడు. ఏడాది వ్యవధిలోనే ఫించ్‌ నాలుగుసార్లు అఫ్రిది చేతిలో ఔటయ్యాడంటే వీరిది ఫెవరెట్‌ జోడి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే అభిమానులు కూడా ఫించ్‌ను ట్రోల్‌ చేస్తూ కామెంట్‌ చేశారు. ''ఏంటి ఫించ్‌.. అఫ్రిది అంటే అంత ఇష్టమా నీకు.. ప్రతీసారి అతని బౌలింగ్‌లోనే ఔటవుతున్నావు.. మీ బంధం దృడమైనది.. ఎవరు విడదీయలేరు'' అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక ఫించ్‌తో పాటు సీన్‌ అబాట్‌ను గోల్డెన్‌ డక్‌గా అఫ్రిది ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ఆ తర్వాత అతను చేసిన సెలబ్రేషన్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పాకిస్తాన్‌తో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌నలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజం(66) రాణించగా.. కుష్‌దిల్‌ 24, రిజ్వాన్‌ 23 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఫించ్‌ 55 పరుగులతో రాణించగా.. చివర్లో బెన్‌ మెక్‌డెర్మోట్‌ 22 పరుగులు నాటౌట్‌ జట్టును గెలిపించాడు.

చదవండి: ICC Rankings: దూసుకుపోతున్న పాక్‌ ప్లేయర్లు.. మూడో స్థానానికి ఎగబాకిన టీమిండియా పేసర్‌

Shikar Dhawan: 'లవ్‌ ప్రపోజ్‌ చేస్తే రిజెక్ట్‌ చేసింది.. కోహినూర్‌ డైమండ్‌ను మిస్సయ్యావు!'

మరిన్ని వార్తలు