కోహ్లికి అందమైన భార్య అనుష్క.. మాకేం పని?

27 Sep, 2020 18:04 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఇటీవల భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌, టీమిండియా కెప్టెన్‌ కోహ్లి భార్య అనుష్క శర్మల మధ్య వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.  కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌ తర్వాత కోహ్లికి సరైన ప్రాక్టీస్‌ లేదని, అనుష్క శర్మ బౌలింగ్‌ను లాక్‌డౌన్‌లో ప్రాక్టీస్‌ చేయడంతో విఫలం అవుతున్నాడని గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. దీనిపై సోషల్‌ మీడియాలో ఒక వర్గం అభిమానులతో పాటు అనుష్క శర్మ కూడా మండిపడ్డారు. కోహ్లి బ్యాటింగ్‌ వైఫల్యం విషయంలో తనను ఎందుకు లాగుతున్నారంటూ కౌంటర్‌ ఎటాక్‌ దిగారు.

‘మిస్టర్‌ గావస్కర్‌... మీ వ్యాఖ్య అమర్యాదగా ఉంది. అయితే భర్త ఆట గురించి భార్యను తప్పు పడుతున్నట్లుగా ఉన్న ఈ వ్యాఖ్య మీ నుంచి ఎలా వచ్చింది. ఇన్నేళ్లుగా ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి కామెంటరీలో మీరు ఎప్పుడూ మాట్లాడలేదు. నాకు కూడా అలాంటి గౌరవం ఇవ్వాలని మీరు అనుకోలేదా’ అంటూ ప్రశ్నించారు. అనుష్క కామెంట్స్‌పై గవాస్కర్‌ స్పందిస్తూ..  తాను ఎలాంటి తప్పుడు మాట మాట్లాడలేదని, కొందరు వక్రీకరించడంతో సమస్య వచ్చిందంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ అనుష్కపై విమర్శలు ఎక్కడ చేశానో చూపించాలన్నారు.(చదవండి:నా కెప్టెన్సీ స్కిల్స్‌కు అతనే కారణం: రోహిత్‌)

ఈ వివాదంపై ఇప్పటికే గావస్కర్‌కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మద్దతుగా నిలవగా, తాజాగా  మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ కూడా అండగా నిలిచారు. ‘నాకు గావస్కర్‌ గురించి బాగా తెలుసు. అది గావస్కర్‌ కాస్త జోక్‌గా చెప్పారనే నేను అనుకుంటున్నా. ఇందులో ఎటువంటి తీవ్రత లేదు. దీనిపై రాద్దాంతం అనవసరం’ అని ఫరూక్‌ అన్నారు.

నా విషయంలో ఇదే తంతు..
గతంలో అనుష్క శర్మను విమర్శించిన క్రమంలో తనపై కూడా ఇలానే విమర్శలు వచ్చాయన్నారు.  ఆ వివాదాన్ని కూడా రాద్దాంత చేశారని ఫరూక్‌ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో టీమిండియా సెలక్టర్లను విమర్శించే క్రమంలో అనుష్క శర్మకు టీ కప్పులు ఇవ‍్వడానికి వెళ్లారా అంటూ ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. దీనిపై అనుష్క శర్మ స్పందిస్తూ.. ఫరూక్‌పై మండిపడ్డారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన 82 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్‌.. ‘ అనుష్కను నేను కానీ గావస్కర్‌ కానీ ఎందుకు విమర్శిస్తాం. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి అనుష్క అందమైన భార్య. వారిని విమర్శించే అవసరం మాకు లేదు. గావస్కర్‌ ఏదో సరదాగా వ్యాఖ్యానించి ఉంటారు.  అంతేకానీ వేరే ఉద్దేశం ఉండదని నా అభిప్రాయం’ అని ఫరూక్‌ పేర్కొన్నారు.(చదవండి: ఊరిస్తున్న సన్‌రైజర్స్‌ టైటిల్‌ సెంటిమెంట్‌!)

గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సందర్భంగా సెలక్షన్‌  కమిటీతో పాటు అనుష్క శర్మను ఫరూక్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ‘మన సెలక్షన్‌ కమిటీ ఎంపికకు దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. వారు ఆడింది 10 నుంచి 12 టెస్టులు మాత్రమే. అసలు వరల్డ్‌కప్‌కు వెళ్లిన సెలక్టర్లు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలీదు. కానీ వారు భారత జెర్సీలు ధరించడంతో సెలక్టర్లలో ఒకరిగా అనుకున్నా(ఎంఎస్‌కే ప‍్రసాద్‌ను ఉద్దేశిస్తూ). ఈ సెలక్టర్లు కోహ్లి భార్య అనుష్కకు టీ కప్‌లు అందివ్వడం నేను చూశా. నాతో పాటు అంతా చూసి ఉండవచ్చు. అనుష్క శర్మకు టీ కప్‌లు ఇవ్వడం కోసం వారు పని చేశారు’ అని ఘాటుగా స్పందించారు. అది అప్పట్లో వివాదానికి దారి తీసింది.

Poll
Loading...
మరిన్ని వార్తలు