చరిత్రలో ఇది ఏడోసారి మాత్రమే

25 Feb, 2021 22:27 IST|Sakshi

అహ్మదాబాద్‌: పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా అద్బుత విజయంతో పాటు పలు రికార్డులు బద్దలయ్యాయి. ఐదు రోజులు జరగాల్సిన ఈ మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసింది.  టెస్టు క్రికెట్‌ అత్యంత తక్కువ బాల్స్‌లోనే మ్యాచ్‌ ముగియడం చరిత్రలో ఏడోసారి మాత్రమే. తాజాగా పింక్‌ బాల్‌ టెస్టులో 842 బంతుల్లోనే ఫలితం వచ్చింది. కాగా ఈ ఏడులో ఆరు డే టెస్టులు కాగా.. ఇండియా, ఇంగ్లండ్‌ మాత్రమే డే నైట్‌ కావడం విశేషం. ఒకసారి ఆ వివరాలు పరిశీలిస్తే..

1923లో ఆస్ట్రేలియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా( మెల్‌బోర్న్‌.. 656 బంతులు) తొలి స్థానం
1935లో వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌( బ్రిడ్జ్‌టౌన్‌.. 672 బంతులు) రెండో స్థానం
1888లో ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా( మాంచెస్టర్‌.. 788 బంతులు) మూడో స్థానం
1888లో ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా( మాంచెస్టర్‌.. 788 బంతులు)  నాలుగో స్థానం
1889లో దక్షిణాఫ్రికా వర్సెస్‌ ఇంగ్లండ్‌( కేప్‌టౌన్‌.. 796 బంతులు) ఐదో స్థానం
1912లో ఇంగ్లండ్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా( ఓవల్‌.. 815 బంతులు) ఆరో స్థానం
2021లో ఇంగ్లండ్‌ వర్సెస్‌ టీమిండియా(అహ్మదాబాద్‌.. 842 బంతుల) ఏడో స్థానం
చదవండి: స్వదేశం.. విదేశం.. రెండింట్లో కోహ్లినే టాప్‌

మరిన్ని వార్తలు