IND Vs SA 2nd Test Day 1: రహానే వికెట్‌తో రికార్డుల్లోకెక్కిన సఫారీ బౌలర్‌

3 Jan, 2022 17:22 IST|Sakshi

వాండరర్స్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా టాపార్డర్‌ కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ లంచ్ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. రాహుల్‌(74 బంతుల్లో 19; 4 ఫోర్లు), విహారి(12 బంతుల్లో 4) క్రీజ్‌లో ఉన్నారు. మయాంక్ అగర్వాల్ (37 బంతుల్లో 26; 5 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించినా, పుజారా (3), రహానే (0)లు వైఫల్యాల పరంపరను కొనసాగించారు. 

ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బౌలర్‌ ఒలివర్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత ఇన్నింగ్స్‌ 24వ ఓవర్‌ మూడో బంతికి పుజారాను ఔట్‌ చేసిన అతను.. నాలుగో బంతికి రహానేను గోల్డెన్ డక్‌గా వెనక్కు పంపాడు. దీంతో టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

ఒలీవర్ 1486 బంతుల్లో 50 వికెట్ల మార్కును చేరుకోగా.. దక్షిణాఫ్రికాకే చెందిన వెర్నాన్‌ ఫిలాండర్ 1240 బంతుల్లోనే ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్‌ లీ (1844), న్యూజిలాండ్‌ బౌలర్‌ కైల్ జెమీసన్ (1865), ఫ్రాంక్ టైసన్ (1880), షేన్ బాండ్ (1943) ఉన్నారు.
చదవండి: ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ను కాదని విహారి ఎందుకు..?


 

మరిన్ని వార్తలు