FIFA 2022: ప్రపంచకప్‌కు బ్రెజిల్‌ అర్హత.. తొలి దక్షిణ అమెరికా జట్టుగా

13 Nov, 2021 08:34 IST|Sakshi

FIFA 2022: Brazil Qualify For World Cup By Beat Colombia- సావోపాలో (బ్రెజిల్‌): ఖతర్‌ వేదికగా 2022లో జరిగే ‘ఫిఫా’ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఐదు సార్లు చాంపియన్‌ బ్రెజిల్‌ అర్హత సాధించింది. ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌ దక్షిణ అమెరికా రీజియన్‌ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ 1–0తో కొలంబియాపై విజయం సాధించింది. బ్రెజిల్‌ తరఫున లుకాస్‌ (72వ నిమిషంలో) గోల్‌ సాధించాడు.

దాంతో టోర్నీలో బ్రెజిల్‌ 12 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, ఒక ‘డ్రా’తో మొత్తం 34 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. తద్వారా టోర్నీలో మరో ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి దక్షిణ అమెరికా జట్టుగా బ్రెజిల్‌ నిలిచింది.    

చదవండి: ‘గోపీచంద్‌ మరిన్ని విజయాలు అందించాలి’
Ind Vs Nz Test Series: విహారిపై ఎందుకింత వివక్ష.. దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. ట్వీట్‌తో.. కానీ..

మరిన్ని వార్తలు