FIFA Ban On AIFF: భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం‌.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

17 Aug, 2022 12:47 IST|Sakshi

అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య (ఫిఫా) నిషేధం విధించిన నేపథ్యంలో భారత దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై ఇవాళ (ఆగస్ట్‌ 17) విచారణ జరిపిన కోర్టు.. ఏఐఎఫ్‌ఎఫ్‌పై ఫిఫా సస్పెన్షన్‌ ఎత్తివేసేలా కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అండర్‌ 17 మహిళల ప్రపంచకప్‌ను భారత్‌లోనే నిర్వహించేలా చూడాలని ఆదేశించింది.

కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ.. ఫిఫాతో చర్చలు జరుపుతున్నామని వివరణ ఇచ్చారు. ఈ అంశాన్ని ఆగస్టు 22న విచారించాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, తృతీయ పక్షం జోక్యం కారణంగా ఏఐఎఫ్‌ఎఫ్‌పై ఫిఫా సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం తెలిసిందే. 
చదవండి: భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యకు భారీ షాక్‌.. సస్పెన్షన్‌ వేటు వేసిన ఫిఫా

>
మరిన్ని వార్తలు