FIFA WC 2022: స్విట్జర్లాండ్‌ శుభారంభం.. కామెరున్‌పై విజయం

24 Nov, 2022 17:34 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో స్విట్జర్లాండ్‌ శుభారంభం చేసింది. గ్రూప్‌-జిలో భాగంగా గురువారం కామెరున్‌తో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ 1-0 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలి అర్థభాగం ఎలాంటి గోల్‌ లేకుండానే ముగిసింది. అయితే రెండో అర్థభాగం మొదలైన కాసేపటికే ఆట 47వ నిమిషంలో స్విట్జర్లాండ్‌ ఆటగాడు బ్రీల్‌ ఎంబోలో తన సహచర ఆటగాడి నుంచి వచ్చిన సూపర్‌ పాస్‌ను చక్కగా వినియోగించుకొని గోల్‌గా మలిచాడు.

దీంతో స్విట్జర్లాండ్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పలుమార్లు ఇరుజట్లు అటాకింగ్‌ గేమ్‌ ఆడినప్పటికి మరో గోల్‌ రాలేదు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఇచ్చిన అదనపు సమయంలోనూ స్విట్జర్లాండ్‌కు గోల్‌ చేసే అవకాశమొచ్చినప్పటికి మిస్‌ అయింది. ఈలోగా సమయం పూర్తవడంతో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ విజేతగా నిలిచింది. 

మరిన్ని వార్తలు