FIFA WC 2022: రెండు గోల్స్‌.. అంతా తలకిందులు! దురదృష్టం అంటే జర్మనీదే! భారీ షాకిచ్చిన జపాన్‌

2 Dec, 2022 12:55 IST|Sakshi

FIFA World Cup Qatar 2022ఫిఫా వరల్డ్‌కప్‌-2022లో జర్మనీకి ఊహించని షాక్‌ తగిలింది. నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఈ మేటి జట్టు ఈసారి కనీసం నాకౌట్‌ దశకు కూడా చేరలేకపోయింది. కోస్టారికాపై ఘన విజయం సాధించినప్పటికీ... జపాన్‌ కారణంగా దురదృష్టకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

అసలేం జరిగిందంటే..
Germany Vs Costa Rica: గ్రూప్‌-ఇలో భాగమైన జర్మనీ శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోస్టారికాను 4-2తో ఓడించింది. అయితే, ఈ జట్టు ప్రిక్వార్టర్స్‌ చేరే క్రమంలో.. ఇదే గ్రూపులో ఉన్న జపాన్‌- స్పెయిన్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అనూహ్య రీతిలో జపాన్‌, స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. దీంతో జర్మనీ నాకౌట్‌ ఆశలు గల్లంతయ్యాయి.

జర్మనీ అవుట్‌.. ఎందుకంటే..
Japan Vs Spain: తాజా విజయంతో ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు గెలిచిన జపాన్‌ ఆరు పాయింట్లతో గ్రూప్‌- ఇ టాపర్‌గా నిలిచింది. ఇక జర్మనీ, స్పెయిన్‌ ఒక్కో విజయం సాధించి.. రెండేసి పాయింట్లు సంపాదించినప్పటికీ జర్మనీకి పరాభవం తప్పలేదు. 

ఈ రెండు జట్ల పాయింట్లు సమానంగా ఉన్నప్పటికీ గోల్స్‌ విషయంలో జర్మనీ(6 గోల్స్‌) వెనుకబడింది. తాజాగా జపాన్‌తో ఒక గోల్‌ చేయగలిగిన స్పెయిన్‌ మొత్తంగా 9 గోల్స్‌తో జర్మనీని వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. నిజానికి జపాన్‌ గనుక ఈ మ్యాచ్‌లో ఓడి ఉంటే.. జర్మనీ, స్పెయిన్‌ రౌండ్‌ 16కు అర్హత సాధించేవి.

స్పెయిన్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసిన జపాన్‌ ఖాతాలో మొత్తంగా ఉన్నవి నాలుగు గోల్సే. అయినప్పటికీ గెలుపుతో ఆరు పాయింట్లు కొట్టేసి ముందడుగు వేసింది. కాబట్టి జర్మనీని దురదృష్టం వెంటాడిందని చెప్పొచ్చు. ఇక గ్రూప్‌-ఇ టాపర్‌గా జపాన్‌, రెండో స్థానంలో ఉన్న స్పెయిన్‌ ప్రిక్వార్టర్స్‌కు చేరుకోగా.. జర్మనీ ఇంటిబాట పట్టింది. ఇక నవంబరు 23 నాటి మ్యాచ్‌లో మొదట జర్మనీని(1-2తో) ఓడించిన జపాన్‌.. తాజాగా స్పెయిన్‌ ఓడించింది. దీంతో జర్మనీ పాలిట జపాన్‌ శాపంగా మారిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా!
KL Rahul: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్‌! సెలవు మంజూరు చేసిన బీసీసీఐ!

మరిన్ని వార్తలు