FIFA WC 2022: 1986 తర్వాత తొలిసారి నాకౌట్‌ దశకు మొరాకో.. గ్రూప్‌ టాపర్‌గా!

2 Dec, 2022 10:57 IST|Sakshi

మొరాకో మెరిసె..

FIFA World Cup Qatar 2022: ఫిఫా వరల్డ్‌కప్‌-2022లో భాగంగా గ్రూప్‌ ‘ఎఫ్‌’లో ఆఫ్రికా ఖండానికి చెందిన మొరాకో జట్టు చివరి లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది. కెనడా జట్టును 2–1తో ఓడించి 1986 తర్వాత ప్రపంచగకప్‌లో నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌ టోర్నీలో ఏడు పాయింట్లు సాధించిన మొరాకో గ్రూప్‌ ‘ఎఫ్‌’ టాపర్‌గా నిలిచింది.

కెనడాతో మ్యాచ్‌లో మొరాకో తరఫున హకీమ్‌ జియెచ్‌ (4వ ని.లో), యుసెఫ్‌ ఎన్‌ నెస్రి (23వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా... 40వ నిమిషంలో మొరాకో డిఫెండర్‌ నాయెఫ్‌ సెల్ఫ్‌ గోల్‌తో కెనడా ఖాతాలో గోల్‌ చేరింది.

మెక్సికోకు నిరాశ...
గ్రూప్‌ ‘సి’ చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా 2–0తో పోలాండ్‌పై... మెక్సికో 2–1తో సౌదీ అరేబియాపై గెలిచాయి. రెండో విజయంతో మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా ఆరు పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా నిలిచి నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్‌ (46వ ని.), అల్వరెజ్‌ (67వ ని.) గోల్‌ చేశారు.

సౌదీ అరేబియాపై మెక్సికో జట్టు గెలిచినా ముందంజ వేయలేకపోయింది. మెక్సికో జట్టులో మార్టిన్‌ (47వ ని.లో), చావెజ్‌ (52వ ని.లో) గోల్‌ చేయగా, సౌదీ తరఫున సాలెమ్‌ (95+5వ ని. ఇంజ్యూరీ టైమ్‌) గోల్‌ చేసి ఓటమిలో ఓదార్పునిచ్చాడు. పోలాండ్, మెక్సికో నాలుగు పాయింట్లతో సమంగా నిలిచినా... గోల్స్‌ అంతరంతో పోలాండ్‌ నాకౌట్‌కు అర్హత సంపాదించింది. 1994 తర్వాత మెక్సికో గ్రూప్‌ దశలోనే అవుటైంది.

చదవండి: BCCI Chief Selector:టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ రేసులో మాజీ స్పీడ్‌స్టర్‌..!
Pak Vs Eng: పాక్‌కు దిమ్మతిరిగేలా ఇంగ్లండ్‌ ప్రపంచ రికార్డు! టీమిండియాను వెనక్కినెట్టి..

మరిన్ని వార్తలు