Lionel Messi: మెస్సీతో మాములుగా ఉండదు మరి..

22 Nov, 2022 16:38 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌‍కప్‌లో అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీ తొలి మ్యాచ్‌లోనే గోల్‌తో మెరిశాడు. మంగళవారం గ్రూప్‌-సిలో సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో మెస్సీ సూపర్‌ గోల్‌ చేశాడు. పెనాల్టీ కిక్‌లో తననెందుకు కింగ్‌ అంటారనేది మెస్సీ మరోసారి నిరూపించాడు. ఆట 9వ నిమిషంలో సౌదీ అరేబియా ఆటగాడి తప్పిదంతో అర్జెంటీనాకు పెనాల్టీ వచ్చింది.

దీనిని మెస్సీ చక్కగా వినియోగించుకున్నాడు. పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంలో మెస్సీని మించినవారు లేరు. గోల్‌పోస్ట్‌కు 12 యార్డుల దూరంలో నిల్చున్న మెస్సీ ఏ మాత్రం తడబాటు లేకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి అర్జెంటీనాకు ఈ ప్రపంచకప్‌లో తొలి గోల్‌ అందించాడు. తద్వారా అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఇక నాలుగు ఫిఫా వరల్డ్‌‍కప్స్‌లో గోల్స్‌ చేసిన తొలి అర్జెంటీనా ఆటగాడిగా మెస్సీ చరిత్ర సృష్టించాడు. 2006, 2014, 2018, 2022లో మెస్సీ గోల్స్‌ కొట్టాడు.ఇక మ్యాచ్‌లో హాఫ్‌ టైమ్‌ ముగిసేసరికి అర్జెంటీనా 1-0తో సౌదీ అరేబియాపై ఆధిక్యంలో నిలిచింది.  

చదవండి: ఖతర్‌లో వరల్డ్‌కప్‌.. కేరళలో తన్నుకున్న అభిమానులు

మరిన్ని వార్తలు