Lionel Messi: చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు

4 Dec, 2022 07:48 IST|Sakshi

అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్‌ కొట్టిన జాబితాలో మెస్సీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజం మారడోనా రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. 

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో రౌండ్‌ ఆఫ్‌ 16 పోరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మెస్సీ ఈ ఫీట్‌ అందుకున్నాడు. ఆట 35వ నిమిషంలో బాటమ్‌ లెఫ్ట్‌ కార్నర్‌ నుంచి గోల్‌ కొట్టిన మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో మూడో గోల్‌ సాధించాడు. ఓవరాల్‌గా ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 23వ మ్యాచ్‌ ఆడుతున్న మెస్సీకి ఇది 9వ గోల్‌ కావడం విశేషం.

ఈ క్రమంలో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో మారడోనా చేసిన 8 గోల్స్‌(21 మ్యాచ్‌లు)ను మెస్సీ అధిగమించాడు.  అర్జెంటీనా తరపున ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడిగా ఆ దేశ దిగ్గజం గాబ్రియెల్‌ బటిస్టుటా 12 మ్యాచ్‌ల్లో 10 గోల్స్‌ చేశాడు. ఇక మెస్సీ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. మెస్సీకి ఇది 1000వ మ్యాచ్‌ కావడం విశేషం. ఓవరాల్‌గా 789 గోల్స్‌ కొట్టాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా క్వార్టర్‌ ఫైనల్స్‌లో డిసెంబర్‌ 10న నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు