FIFA WC 2022: వారెవ్వా అర్జెంటీనా.. మూడోసారి, మూడో స్థానం, మూడో జట్టు.. పాపం ఫ్రాన్స్‌!

19 Dec, 2022 08:47 IST|Sakshi
వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిన అర్జెంటీనా జట్టు

FIFA WC Qatar  2022 World Champions Argentina: ఫిఫా ప్రపంచకప్‌ గెలవాలన్న అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు ఆదివారం(డిసెంబరు 18) తెరపడింది. ఖతర్‌ వేదికగా ఫ్రాన్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో మెస్సీ బృం‍దం విజయం సాధించడంతో కల సాకారమైంది. మేటి ఆటగాడు మెస్సీకి ఘనమైన వీడ్కోలు లభించడంతో పాటు మూడోసారి ట్రోఫీని గెలిచిన ఘనతను అర్జెంటీనా తన ఖాతాలో వేసుకుంది. 

కాగా అదనపు సమయంలోనూ 3-3తో ఇరు జట్లు సమంగా ఉన్న వేళ.. పెనాల్టీ షూటౌట్‌ ద్వారా వరల్డ్‌కప్‌-2022 ఫైనల్‌ ఫలితం తేలిన విషయం తెలిసిందే. 4-2తో అర్జెంటీనా పైచేయి సాధించి విశ్వ విజేతగా అవతరించింది. మరి ఈ మ్యాచ్‌ ద్వారా అర్జెంటీనా సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి! 

మూడోసారి
►ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌ సాధించడం అర్జెంటీనాకిది మూడోసారి. గతంలో ఆ జట్టు 1978, 1986లలో సాధించింది.

మూడో స్థానం
►ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు గెలిచిన జట్ల జాబితాలో అర్జెంటీనా మూడో స్థానానికి చేరుకుంది. బ్రెజిల్‌ (5 సార్లు) టాప్‌ ర్యాంక్‌లో, జర్మనీ (4 సార్లు), ఇటలీ (4 సార్లు) సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో ఉన్నాయి.  

మూడో జట్టు
►‘షూటౌట్‌’ ద్వారా ప్రపంచకప్‌ నెగ్గిన మూడో జట్టు అర్జెంటీనా. గతంలో బ్రెజిల్‌ (1994లో), ఇటలీ (2006లో) ఈ ఘనత సాధించాయి. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌లో ‘షూటౌట్‌’లలో మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. 

పాపం ఫ్రాన్స్‌
►డిఫెండింగ్‌ చాంపియన్‌ తదుపరి టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం ఇది మూడోసారి. గతంలో అర్జెంటీనా (1990లో), బ్రెజిల్‌ (1998లో) జట్లకు ఇలాంటి ఫలితమే ఎదురైంది. ఇప్పుడు ఫ్రాన్స్‌ వంతు!

చదవండి: Lionel Messi: మెస్సీ నామసర్మణతో మారుమ్రోగిన అర్జెంటీనా.. కోల్‌కతాలోనూ సంబరాలు
IND VS BAN 1st Test: విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు

మరిన్ని వార్తలు