Qatar FIFA World Cup 2022: నాకౌట్‌కు దక్షిణ కొరియా

3 Dec, 2022 05:02 IST|Sakshi

పోర్చుగల్‌పై 2–1తో విజయం

గెలిచినా... నిష్క్రమించిన ఉరుగ్వే 

దోహా: గత రెండు ప్రపంచకప్‌లలో గ్రూప్‌ దశకే పరిమితమైన దక్షిణ కొరియా ఈసారి సత్తా చాటింది. కీలకమైన చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెలరేగి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. పోర్చుగల్‌తో జరిగిన గ్రూప్‌ ‘హెచ్‌’ పోరులో కొరియా 2–1తో గెలిచింది. మ్యాచ్‌ 5వ నిమిషంలోనే హోర్టా గోల్‌ సాధించి పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలిపాడు.

అయితే కొరియా తరఫున 27వ నిమిషంలో కిమ్‌ యంగ్‌ గ్వాన్‌ గోల్‌ చేసి స్కోరును సమం చేయగా...మ్యాచ్‌ చివర్లో వాంగ్‌ హీ చాన్‌ చేసిన అద్భుతమైన కౌంటర్‌ అటాక్‌ గోల్‌ (90+1వ నిమిషంలో)తో కొరియా దూసుకుపోయింది. గ్రూప్‌లో ఈ మ్యాచ్‌కు ముందే 2 విజయాలు సాధించి నాకౌట్‌ చేరిన పోర్చుగల్‌తో పాటు రెండో జట్టుగా కొరియా ముందంజ వేసింది. ఘనాతో మ్యాచ్‌ ముగిశాక రిఫరీతో వాగ్వాదం చేసినందుకు ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటుకు గురైన కొరియా కోచ్‌ పౌలో బెంటో ఈ మ్యాచ్‌ను ప్రేక్షకుల గ్యాలరీల్లో కూర్చోని చూశారు.   
చదవండి: Football: కుప్పకూలి.. యువ ఆటగాడు కన్నుమూత

మరిన్ని వార్తలు