అమిత్‌ రోహిదాస్‌కే భారత హాకీ పగ్గాలు.. ఇక మన్‌ప్రీత్‌ సింగ్‌..

12 Apr, 2022 08:17 IST|Sakshi

FIH Pro League: జర్మనీ జట్టుతో ఈనెల 14, 15వ తేదీల్లో భువనేశ్వర్‌లో జరిగే ప్రొ లీగ్‌ హాకీ మ్యాచ్‌ల్లో పాల్గొనే భారత పురుషుల జట్టును ప్రకటించారు. ఒడిశాకు చెందిన డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ జట్టులో సభ్యుడిగా, వైస్‌ కెప్టెన్‌గా ఉంటాడు.

స్వదేశంలో అర్జెంటీనా, ఇంగ్లండ్‌ జట్లతో జరిగిన నాలుగు ప్రొ లీగ్‌ మ్యాచ్‌ల్లో అమిత్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొమ్మిది జట్లు బరిలో ఉన్న ప్రొ లీగ్‌లో భారత్‌ 21 పాయింట్లతో ‘టాప్‌’ ర్యాంక్‌లో ఉంది. 

చదవండి: IPL 2022: టైటాన్స్‌ జోరుకు రైజర్స్‌ బ్రేక్‌

మరిన్ని వార్తలు