టోక్యోకు భారత్‌ నుంచి తొలి బృందం

18 Jul, 2021 01:03 IST|Sakshi

న్యూఢిల్లీ: శతకోటి ఆశలను, ఆకాంక్షలను మోసుకుంటూ భారత్‌ నుంచి క్రీడాకారులు, క్రీడాధికారులతో కూడిన తొలి బృందం శనివారం రాత్రి టోక్యోకు పయనమైంది. తొలి బృందంలో 88 మంది ఉన్నారు. ఇందులో ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్‌ టెన్నిస్, జూడో, జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో పాల్గొనే 54 మంది క్రీడాకారులు ఉన్నారు. మిగతా వారు సహాయ సిబ్బంది ఉన్నారు. భారత్‌ నుంచి మొత్తం 127 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా... విదేశాల్లో శిక్షణకెళ్లిన పలువురు క్రీడాకారులు అక్కడి నుంచే నేరుగా టోక్యో చేరుకుంటున్నారు.  

షూటర్లకు క్వారంటైన్‌ లేదు
విదేశాల్లో శిక్షణ తీసుకున్న భారత షూటర్లు నేరుగా టోక్యోకు చేరడంతో క్వారంటైన్‌ తప్పింది. దీంతో వారంతా సోమవారం నుంచి ప్రాక్టీస్‌ చేసుకునే వీలు చిక్కింది. ఒలింపిక్స్‌కు అర్హత పొందిన 15 మంది షూటర్లలో 13 మంది క్రొయేషియాలో, ఇద్దరు స్కీట్‌ షూటర్లు ఇటలీలో తుది కసరత్తు చేశారు. ఆటలకు సమయం దగ్గరపడటంతో ఆమ్‌స్టర్‌డామ్‌లో ఒక్కటైన షూటింగ్‌ జట్టు అక్కడి నుంచి శనివారం ఉదయం టోక్యోకు చేరుకుంది.

మరిన్ని వార్తలు