#Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన బుమ్రా.. 110 ఏళ్లలో ఒకే ఒక్కడు

4 Feb, 2024 10:52 IST|Sakshi

వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా నిప్పులు చేరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్‌ బ్యాటర్లకు బుమ్రా చుక్కలు చూపించారు. బుమ్రా బౌలింగ్‌ దాటికి ఇంగ్లీష్‌ ఆటగాళ్లు బ్యాట్‌లెత్తేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు.

ఈ మ్యాచ్‌లో తీసిన 6 వికెట్ల ద్వారా జస్ప్రీత్ బుమ్రా తన టెస్ట్ కెరీర్‌లో 150 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో  34 టెస్టులు ఆడిన బుమ్రా 64 ఇన్నింగ్స్‌ల్లో 20.29 సగటుతో 152 వికెట్లు తీశాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట బుమ్రా లిఖించుకున్నాడు.
గత 110 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మెరుగైన సగటుతో 150 వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం అలాన్ డేవిడ్సన్ పేరిట ఉండేది. 1953-1963 మధ్య కాలంలో అలాన్ డేవిడ్సన్ 20.53 సగటుతో 150 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో డేవిడ్సన్ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. అయితే 1950 కంటే ముందు ఇంగ్లండ్‌ లెజెండరీ పేసర్‌ సిడ్నీ బర్న్స్‌(1901-1974 కాలం) 16.43 సగటుతో 150 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.

కాగా బుమ్రా మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.  అతి తక్కువ బంతుల్లోనే  150 టెస్టు వికెట్లు సాధించిన భారత తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 6781 బంతుల్లో ఈ ఘనతను జస్ప్రీత్‌ అందుకున్నాడు. ఈ క్రమంలో వెటరన్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌(7661)ను బుమ్రా అధిగమించాడు.

చదవండి: #Angelo Mathews: ఏంటి అన్న నీ​కే ఎందుకు ఇలా? ఫోర్‌ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు! వీడియో వైరల్‌

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega