మ్యాన్‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌ అవార్డుగా చేప..

21 Sep, 2020 21:48 IST|Sakshi

కశ్మీర్‌: మనకు క్రికెట్‌లో చాలా రకాలు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు తెలుసు. మరి చేపను ఎక్కడైనా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఇవ్వడం చూశారా. ఒక క్రికెట్‌ మ్యాచ్‌లో చేపను మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పెట్టుకోవడం ఆసక్తిని కల్గిస్తోంది. ఇది కశ్మీర్‌లోని తెకిపూరా కుప్వారా క్రికెట్‌ లీగ్‌లో చోటు చేసుకుంది. మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలిచిన క్రికెటర్‌కు 2.5 కేజీల చేపను అందించడం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. దీన్ని జర్నలిస్టు ఫిర్దోస్‌ హసన్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీనికి ఫిదా అవుతున్న అభిమానులు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ లీగ్‌ను ఫేమస్‌ చేయడం కోసమే ఇలా చేస్తున్నారని ఫిర్దోస్‌ పేర్కొన్నాడు.  అంతేకాకుండా పిచ్‌ పేలవంగా ఉన్న పరిస్థితిని ఎత్తిచూపడానికి ఇలా చేసి ఉండవచ్చని కూడా ఫిర్దోస్‌ తెలిపాడు. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి, ఆటగాళ్లు తమ జేబులోనుంచే డబ్బులు తీయాల్సిన పరిస్థితితో ఇలా చేపన మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. మనకు తెలిసినంత వరకు ఒక క్రికెట్‌ లీగ్‌లో చేపను మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఇవ్వడం తొలిసారే కావొచ్చు.(చదవండి:రైనా విలవిల.. నాకే ఎందుకిలా?)

మరిన్ని వార్తలు