Pele: నా తండ్రికి ప్రాణాపాయం తప్పింది.. మీ అందరికి కృతజ్ఞతలు

14 Sep, 2021 12:26 IST|Sakshi

బ్రెసిలియా: అనారోగ్యం బారిన పడ్డ బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే కోలుకుంటున్నారు. పెద్ద ప్రేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పీలే బ్రెజిల్‌లోని సావోపాలో ఆసుపత్రిలో చేరారు. కాగా ఆయనకు రెండు రోజుల క్రితం వైద్యులు సర్జరీ నిర్వహించారు. అప్పటినుంచి ఐసీయూలో ఉన్న పీలేను తొందరలోనే రెగ్యులర్‌ రూమ్‌కు షిఫ్ట్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా పీలే కూతురు తన తండ్రి ఆరోగ్య విషయమై ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. 

చదవండి: PELE: ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం..

''నా తండ్రి సర్జరీ అనంతరం త్వరగానే కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయనను రెగ్యులర్‌ రూమ్‌కు షిఫ్ట్‌ చేయనున్నారు. మరో రెండు రోజుల్లో ఇంటికి కూడా వెళ్లనున్నాం. మీ అందరి దీవెనలతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. సర్జరీ చేసి ఆయనను మాములు మనిషిని చేసిన వైద్యుల బృందానికి, అండగా నిలిచిన ఆసుపత్రి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అతను కోలుకోవాలని ప్రార్థిస్తూ లక్షల మంది అభిమానులు పంపించిన మొయిల్స్‌, విషెస్‌కు కృతజ్ఞతలు. మీ మెయిల్స్‌ అన్ని చదవలేకపోయినా.. ఆయనపై చూపించిన ప్రేమ, అభిమానం మిమ్మల్ని మరింత దగ్గర చేసింది. థ్యాంక్యూ సో మచ్‌'' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.

మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదైవుంది. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్‌ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్‌ చేశాడు. బ్రెజిల్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. ఇక ఫుట్‌బాల్‌ క్లబ్‌ మ్యాచ్‌ల విషయానికి వస్తే.. పీలే 1957 నుంచి 1974 వరకు సాంటోస్‌ క్లబ్‌కు 19 సీజన్ల పాటు ఆడి 643 గోల్స్‌ చేశాడు. 

చదవండి: Emma Raducanu: అంతా నాలుగు నెలల్లోనే... అనామక ప్లేయర్‌ నుంచి చాంపియన్‌ దాకా!

A post shared by Kely Nascimento (@iamkelynascimento)

మరిన్ని వార్తలు