Munich Air Disaster: ఫిబ్రవరి 6, 1958.. ఫుట్‌బాల్‌ చరిత్రలో అతి పెద్ద విషాదం

6 Feb, 2022 21:15 IST|Sakshi

చరిత్రలో కొన్ని ఘటనలు విషాదాలుగా మిగిలిపోయాయి. సమయం వచ్చినప్పుడు వాటి గురించి ప్రస్తావించుకోవడం తప్ప వాటిని మార్చలేం. అలాంటి కోవకు చెందినది 1958 మునిచ్‌ ఎయిర్‌ డిజాస్టర్‌. మాంచెస్టర్‌ యునైటెడ్‌కు చెందిన ఫుట్‌బాల్‌ టీమ్‌తో వెళ్తున్న ఎయిర్‌క్రాప్ట్‌ క్రాష్‌ అవడంతో​ అందులో ఉన్న 23 మంది ఆనవాళ్లు లేకుండా పోయారు. ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అతి పెద్ద విషాదంగా మిగిలిపోయిన ఆ ఘోర దుర్ఘటనకు నేటితో(ఫిబ్రవరి 6) 64 ఏళ్లు పూర్తయ్యాయి. 

ఆరోజు ఏం జరిగింది..
1958 ఫిబ్రవరి 6.. మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌ మంచి ఉత్సాహంతో ఉంది. ఏ మ్యాచ్‌లో పాల్గొన్న విజయం వారిదే అవుతుంది. ఎందుకంటే జట్టు మొత్తం యువ ఆటగాళ్ల రక్తంతో నిండిపోయింది. ఉరకలేసే ఉత్సాహానికి తోడు మంచి మేనేజర్‌ కలిగి ఉన్నాడు. అందుకే ఆ జట్టుకు బస్‌బే బేబ్స్‌ అని నిక్‌నేమ్‌ వచ్చింది. జర్మనీలోని మ్యునిచ్‌లో మ్యాచ్‌ ఆడడానికి ఫుట్‌బాల్‌ ప్లేయర్లు సహా ఇతర సిబ్బంది ఎయిర్‌బేస్‌లో బయలుదేరారు. విజయంతో తిరిగి రావాలని మాంచెస్టర్‌ ప్రజలు దీవించి పంపారు. కానీ వారి దీవెనలు పనిచేయలేదు. ఆకాశంలో ఎగిరిన కాసేపటికే ఎయిర్‌బేస్‌కు ట్రాఫిక్‌ సంబంధాలు తెగిపోయాయి.

దీంతో ఎయిర్‌బేస్‌ కుప్పకూలిందేమోనన్న అనుమానం కలిగింది. వారి అనుమానమే నిజమయింది. సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిన ఎయిర్‌ బేస్‌లో ఉన్న 8 మంది ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌ సహా, మాంచెస్టర్‌ యునైటెడ్‌ సిబ్బంది, జర్నలిస్టులు, ఎయిర్‌బేస్‌ సిబ్బంది సహా మరో ఇద్దరి ప్రయాణికులు మొత్తం 23 మందిలో ఏ ఒక్కరు బతికి బట్టకట్టలేదు. మ్యునిచ్‌ ఎయిర్‌బేస్‌ విమాన శకలాలు ఇప్పటికి అక్కడే ఉన్నాయి. చనిపోయిన వారి జ్ఞాపకార్థం అక్కడే మ్యూజియం ఏర్పాటు చేసి విమాన శకలాలను భద్రపరిచారు.

మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్ళు
జియోఫ్ బెంట్
రోజర్ బైర్న్
ఎడ్డీ కోల్మన్
డంకన్ ఎడ్వర్డ్స్
మార్క్ జోన్స్
డేవిడ్ పెగ్
టామీ టేలర్
లియామ్ "బిల్లీ" వీలన్

మాంచెస్టర్ యునైటెడ్ సిబ్బంది
వాల్టర్ క్రిక్మెర్ - క్లబ్ కార్యదర్శి
టామ్ కర్రీ - శిక్షకుడు
బెర్ట్ వాలీ - చీఫ్ కోచ్

ఎయిర్‌బేస్‌ సిబ్బంది
కెప్టెన్ కెన్నెత్ రేమెంట్
టామ్ కేబుల్

జర్నలిస్టులు
ఆల్ఫ్ క్లార్క్
డానీ డేవిస్
జార్జ్ అనుసరిస్తాడు
టామ్ జాక్సన్
ఆర్చీ లెడ్‌బ్రూక్
హెన్రీ రోజ్
ఫ్రాంక్ స్విఫ్ట్
ఎరిక్ థాంప్సన్

మరిన్ని వార్తలు