Ian Chappell: 45 ఏళ్ల కామెంటరీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన క్రికెట్‌ దిగ్గజం

15 Aug, 2022 16:04 IST|Sakshi

ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ తన 45 ఏళ్ల కామెంటరీ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. చాపెల్ తన నిర్ణయాన్ని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం ప్రకటించాడు. చాలా కాలం నుంచి కామెంటరీకు గుడ్‌బై చేప్పాలని ఆలోచనలో ఉన్నట్లు చాపెల్ తెలిపాడు. చాపెల్ 75 టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా తరపున ప్రాతినిథ్యం వహించాడు. వాటిలో 30 మ్యాచ్‌లకు ఆసీస్‌ కెప్టెన్‌గా చాపెల్ వ్యవహరించాడు. 1977లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన చాపెల్‌.. అనంతరం కామెంటెటర్‌గా తన కెరీర్‌ ప్రారంభించాడు.

ఇక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో  చాపెల్ మాట్లాడుతూ.. "క్రికెట్‌ నుంచి నేను తప్పుకోవాలని అనుకున్న రోజు ఇప్పటకీ నాకు బాగా గుర్తుంది. నా క్రికెట్‌ కెరీర్‌లో అఖరి రోజు వాచ్‌ చూశాను. టైమ్‌ 11 దాటింది. ఇక చాలు అని డిసైడయ్యాను. ఇక వ్యాఖ్యానం విషయంలోనూ అదే నిర్ణయం తీసుకున్నా. కొన్నేళ్ల కిందట నాకు గుండెపోటు వచ్చింది. నేను అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను.

కానీ ఆ తర్వాత ఆరోగ్య పరంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకున్న, మెట్లు ఎక్కడంలాంటి పనులు చేసిన అలసట ఎక్కువగా వచ్చేది. అ సమయంలో  రగ్బీ లీగ్‌ వాఖ్యత లెజెండరీ రే వారెన్‌ చెప్పిన విషయం ఒకటి గుర్తొచ్చింది. ఒక తప్పు చేయడానికి ఒక అడగు దూరంలో మీరుంటారు అని అతడు చెప్పేవాడు. అప్పడే ఇక కామెంటరీని వదిలేయాలని నిర్ణయించుకున్నా" అని చాపెల్ పేర్కొన్నాడు.
చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్‌ షమీ ‘భార్య’ అభ్యర్ధన

మరిన్ని వార్తలు