Rod Marsh Death: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ కన్నుమూత..

4 Mar, 2022 09:24 IST|Sakshi

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ రాడ్ మార్ష్(74) కన్నుమూశారు. క్వీన్స్‌లాండ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. గత గురువారం గుండెపోటుకు గురైన మార్ష్‌ను  క్వీన్స్‌లాండ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ అతని పరిస్థితి మెరుగుపడలేదు. ఇక ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఒక బలమైన జట్టుగా ఆవిర్భవించడంలో మార్ష్ కీలక పాత్ర పోషించాడు. 1970-80లలో ఆస్ట్రేలియా జట్టులో కీలకమైన ఆటగాడిగా మార్ష్‌ ఉన్నారు. అతడు జట్టులో తన వికెట్‌ కీపింగ్‌తో పాటు, తన బ్యాటింగ్‌తో కూడా జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు.

టెస్టుల్లో సెంచరీ సాధించిన తొలి ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్‌గా మార్ష్‌ ఉన్నారు. అతను టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించారు.96 టెస్టులు,92 వన్డేల్లో ఆసీస్‌కు  మార్ష్ ప్రాతినిధ్యం వహించాడు. 1970లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆయన 1984లో క్రికెట్‌ నుంచి తప్పుకున్నారు. అతను వికెట్‌ కీపర్‌గా 355 ఔట్‌లు చేశారు. క్రికెట్‌ నుంచి రీటైర్‌ అయ్యాక మార్ష్‌ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఆస్ట్రేలియా క్రికెట్‌కు కూడా సేవలందించారు. అదే విధంగా 2014లో లెజెండరీ క్రికెటర్ ఆస్ట్రేలియా సెలెక్టర్ల ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇక రాడ్ మార్ష్ మృతిపై పలువురు క్రికెటర్‌లు సంతాపం  తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.

చదవండి: India Vs Sri Lanka 1st Test: ఇండియా వ‌ర్స‌స్ శ్రీలంక తొలి టెస్ట్‌​ అప్‌డేట్స్‌

మరిన్ని వార్తలు