-

MS Dhoni Mentor- Ajay Jadeja: ‘ధోనికి నేను వీరాభిమానిని.. ఆ నిర్ణయం మాత్రం సరైంది కాదు’

12 Sep, 2021 12:26 IST|Sakshi

ముంబై: యూఏఈ వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా టీమిండియాకు భారత మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని మెంటార్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. అయితే ధోని ఎంపికపై బీసీసీఐని కొందరు ప్రశంసించగా.. మరికొందరు విమర్శించారు. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు అజయ్‌ జడేజా స్పందిస్తూ బీసీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు.

చదవండి: MS Dhoni: ధోనీకి షాక్‌


''ధోనిని మెంటార్‌గా నియమిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం నన్ను పూర్తిగా నిరాశపరిచింది. ధోనిని ఎంపిక చేయడంపై రెండు రోజులు ఆలోచించా. అయితే ధోనిని నేను తప్పుబట్టడం లేదు. వాస్తవానికి ధోనికి నేను వీరాభిమానిని. అతను మెంటార్‌గా జట్టుకు ఎంతవరకు ఉపయోగపడతాడనే దానిపై మాట్లాడడం లేదు. కేవలం బీసీసీఐని మాత్రమే ఒక ప్రశ్న అడుగుతున్నా. ప్రస్తుతం టీమిండియాకు కోచ్‌, కెప్టెన్‌ రూపంలో బలమైన  వ్యక్తులు ఉన్నారు. రవిశాస్త్రి, కోహ్లి  టీమిండియాను పలుమార్లు నెంబర్‌వన్‌ స్థానంలో ఉంచారు. అందులోనూ ధోని సారధ్యంలో కోహ్లి చాలా మ్యాచ్‌లు ఆడాడు. ధోని వ్యూహాలపై కోహ్లికి మంచి అవగాహన ఉంటుంది. తాజగా ఇప్పుడు ధోనిని మెంటార్‌గా నియమించడం వల్ల రాత్రికి రాత్రే  జట్టులో పెద్ద మార్పులేం చోటుచేసుకోవు.

చదవండి: Gautam Gambhir: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు

MS Dhoni T20 World Cup Mentor: కెప్టెన్‌గా సూపర్‌ సక్సెస్‌.. మరి మెంటార్‌గా

ఈ విషయమే నన్ను ఆశ్చర్యపరిచింది. అయినా ధోని తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లకే మొగ్గు చూపేవాడు. ఇప్పుడు మెంటార్‌గా వచ్చాడు కాబట్టి మళ్లీ అదే రిపీట్‌ అవుతుంది. అయితే తాజాగా  ఇంగ్లండ్‌ గడ్డపై టీమీండియా టెస్టు సిరీస్‌ ఆధ్యంతం నలుగురు ఫాస్ట్‌ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తోనే మంచి ఫలితాలను రాబట్టింది. మెంటార్‌, కోచ్‌ ఇద్దరు జట్టుతో ఉన్నప్పుడు ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి.. దాని ప్రభావం మ్యాచ్‌ ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే..'' అంటూ చెప్పుకొచ్చాడు. 


ఇక టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 12 దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్‌ 24న దుబాయ్‌ వేదికగా తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌, అప్గానిస్తాన్‌, మరో రెండు క్వాలిఫయర్స్‌ జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. కోహ్లి సారధ్యంలోని 15 మంది జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లను పరిగణలలోకి తీసుకోకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

చదవండి: టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం..

మరిన్ని వార్తలు