బాలయ్యకు యువరాజ్‌ సింగ్‌ బర్త్‌డే విషెస్‌

10 Jun, 2021 14:12 IST|Sakshi

ఢిల్లీ: టాలీవుడ్‌ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ బర్త్‌డేను పురస్కరించుకొని టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ట్విటర్‌ ద్వారా యువీ స్పందిస్తూ.. 'హ్యాపీ బర్త్‌డే నందమూరి బాలకృష్ణ సార్‌. మీ నటనతో, మానవతా దృక్పథంతో మీరు చేస్తున్న సేవ నిస్వార్థంగా కొనసాగాలని కోరుకుంటున్నా. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నా.. ఇవే మీకు నా బెస్ట్‌ విషెస్‌' అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా యువీ తాను హైదరాబాద్‌కు వచ్చినప్పడు బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిని సందర్శించినప్పుడు బాలయ్య బాబుతో దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం యువరాజ్‌ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక యువరాజ్‌ సింగ్‌ జూన్‌ 10, 2019న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.తన 17 ఏళ్ల కెరీర్‌లో టీమిండియా తరపున 304 వన్డేల్లో 8701 పరుగులు.. 111 వికెట్లు, 40 టెస్టుల్లో 1900 పరుగులు.. 10 వికెట్లు, 58 టీ20ల్లో 1177 పరుగులు.. 29 వికెట్లు తీశాడు. ఐసీసీ 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్‌ సాధించిన టీమిండియా జట్టులో యువరాజ్‌ సభ్యుడిగా ఉన్నాడు.
చదవండి: డబ్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాకు కష్టమే..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు