Alec Stewart: 'జరగాలంటే రాసి ఉండాలి.. ఇంగ్లండ్‌ ఆటగాడికి మాత్రమే సాధ్యమైంది'

8 Apr, 2022 17:17 IST|Sakshi

ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు అలెక్‌ స్టీవార్ట్‌ (ఏప్రిల్‌ 8) శుక్రవారం 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అందరి క్రికెటర్లలాగే స్టీవార్ట్‌ పుట్టినరోజు ఉంటుంది.. దీనిలో వింతేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అలెక్‌ స్టీవార్ట్‌ 14 ఏళ్ల పాటు ఇంగ్లండ్‌ క్రికెట్‌లో కీలకపాత్ర పోషించాడు. బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌ కీపర్‌గా సేవలందించిన అలెక్‌ స్టీవార్ట్‌ మధ్యలో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గానూ పనిచేశాడు.

స్టీవార్ట్‌ 133 టెస్టుల్లో 8463 పరుగులు.. 170 వన్డేల్లో 4,677 పరుగులు చేశాడు. కాగా స్టీవార్ట్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 8,1963.  ఒక్క విషయంలో మాత్రం స్టీవార్ట్‌ క్రికెటర్స్‌ ఎవరు సాధించలేని ఫీట్‌ అందుకున్నాడు. టెస్టుల్లో 8463 పరుగులు చేసిన స్టీవార్ట్‌.. బర్త్‌డేలోనూ అదే సంఖ్యలు కనిపించడం విశేషం. పరిశీలించి చూస్తే..( 8,4,63).. తారీఖు 8.. నెల నాలుగు.. పుట్టిన సంవత్సరం 63.. వీటన్నింటిని కలిపి చూస్తే స్టీవార్ట్‌ టెస్టుల్లో చేసిన పరుగులు మ్యాచ్‌ అయ్యాయి.

ఇదే విషయాన్ని ఐసీసీ షేర్‌ చేస్తూ అలెక్‌ స్టీవార్ట్‌కు విషెస్‌ చెప్పింది. ఇక ఇంగ్లండ్ తరపున  స్టీవార్ట్‌ రిటైర్‌ అయ్యే టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. అంతేకాదు వికెట్ కీపర్‌గా అత్యధిక డిస్‌మిసల్స్‌ చేసిన మూడో ఆటగాడిగా స్టీవార్ట్‌ ఉన్నాడు. స్టీవార్ట్‌ కంటే అలెన్‌ నాట్‌, మాట్‌ ప్రియర్‌లు ఉన్నారు. ఇక స్టీవార్ట్‌ ఇంగ్లండ్‌కు 15 టెస్టుల్లో నాయకత్వం వహించగా.. అతని కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ నాలుగు గెలిచి.. ఎనిమిది ఓడి.. మిగిలిన మూడు టెస్టులు డ్రా చేసుకుంది. 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ ఫైనల్‌ చేరడంలో స్టీవార్ట్‌ కీలకపాత్ర పోషించాడు.

చదవండి: Nari Contractor: టీమిండియా మాజీ కెప్టెన్‌ తలలో మెటల్‌ ప్లేట్‌.. 60 ఏళ్ల తర్వాత తొలగింపు!

మరిన్ని వార్తలు