భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ మృతి

2 Apr, 2023 12:23 IST|Sakshi
సౌరవ్‌ గంగూలీతో సలీం దురానీ

భారత క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ ఆల్‌ రౌండర్‌ సలీం దురానీ కన్నుమూశారు. 88 ఏళ్ల వయస్సు ఉన్న సలీం దురానీ తన స్వస్థలం జామ్‌నగర్‌లో తుదిశ్వాస విడిచారు. కాగా కొన్ని రోజుల క్రితం దురానీ తన ఇంటివద్ద పడిపోవడంతో తొడ ఎముక విరిగింది. అనంతరం ఈ ఏడాది జనవరిలో  దురానీ ప్రాక్సిమల్ ఫెమోరల్ నెయిల్ సర్జరీ(తొడ ఎముక సర్జరీ) చేయంచుకున్నారు.

అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే అతను మృతి చెందారు. సలీం దురానీ 1934, డిసెంబర్‌ 11న అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌ నగరంలో జన్మించారు. అఫ్గానిస్థాన్‌లో జన్మించిన  ఆయన 1960లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ ద్వారా భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశారు.

1973లో ఇంగ్లండ్‌తో చివరి టెస్టు ఆడారు. 13 ఏళ్ల కెరీర్‌లో దురానీ భారత్ తరపున మొత్తం 27 టెస్టులు ఆడాడు. 27 టెస్టుల్లో 1202 పరుగులతో పాటు 78 వికెట్లు సాధించారు. అతని కెరీర్‌లో ఒక సెంచరీ పాటు 7 అర్ధ శతకాలు ఉన్నాయి. అదే విధంగా 1971లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ చారిత్రత్మక విజయం అందుకోవడంతో దురానీ కీలక పాత్ర పోషించారు. 

క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం దురానీ.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నటుడు ప్రవీన్‌ బాబీతో కలిసి ‘చరిత్ర’ సినిమాలో పనిచేశారు. ఇక దురానీ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి సంతాపం ప్రకటించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని  రవిశాస్త్రి  గుర్తుచేసుకున్నారు.


చదవండిIPL 2023: రాజస్తాన్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ ఢీ.. అతడిపైనే అందరి కళ్లు

మరిన్ని వార్తలు