మాజీ రంజీ క్రికెటర్‌ కన్నుమూత

18 Jun, 2021 11:35 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

బనశంకరి: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కర్ణాటక మాజీ క్రికెటర్‌ బి.విజయకృష్ణ (71) నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం ఉదయం మృతిచెందారు. 1949 అక్టోబరు 12 న జన్మించిన విజయకృష్ణ 15 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో ఎడమచేతి స్పిన్నర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా 80 మ్యాచ్‌లు ఆడారు. 2,000 పరుగులు చేసి 194 వికెట్లు తీశారు. కర్ణాటక రెండుసార్లు రంజీట్రోఫీ గెలవడంలో విజయకృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన మృతికి సీఎం యడియూరప్ప సంతాపం వ్యక్తం చేశారు.
చదవండి: పీఎస్‌ఎల్‌: ఉస్మాన్‌ ఖవాజా మెరుపు సెంచరీ.. 11 ఏళ్ల రికార్డు బద్దలు

మరిన్ని వార్తలు