బోరిస్‌ బెకర్‌కు జైలుశిక్ష

30 Apr, 2022 06:01 IST|Sakshi

లండన్‌: దివాలా కేసులో జర్మనీ టెన్నిస్‌ దిగ్గజం బోరిస్‌ బెకర్‌కు రెండున్నరేళ్ల జైలుశిక్ష విధించారు. 54 ఏళ్ల బెకర్‌ తన దగ్గర రుణ చెల్లింపులకు ఏమీ లేదని, దివాలా తీశానని ప్రకటించి... ఉన్న ఆస్తిపాస్తుల్ని దాచి, అక్రమంగా పెద్దమొత్తంలో నగదు బదిలీ చేశాడు. దీనిపై విచారించిన లండన్‌ కోర్టు దివాలా చట్టం ప్రకారం శిక్ష విధించింది. మొత్తం నాలుగు కేసులకి సంబంధించి గరిష్టంగా ఏడేళ్లదాకా జైలుశిక్ష విధించే అవకాశముంది.

అయితే వాదోపవాదాల అనంతరం రెండున్నరేళ్ల శిక్షను ఖరారు చేసింది. జర్మనీలోని బ్యాంక్‌కు 50 లక్షల డాలర్ల (రూ.38.25 కోట్లు) రుణాన్ని చెల్లించకుండా అనైతిక పద్ధతిలో బోరిస్‌ బెకర్‌ దివాలా పిటిషన్‌తో బయటపడాలని చూశాడు. 2012 నుంచి బ్రిటన్‌లో నివసిస్తున్న బెకర్‌ మొత్తం ఆరు (వింబుల్డన్‌ –1985, 1986, 1989; ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌–1991, 1996; యూఎస్‌ ఓపెన్‌–1989) గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించాడు.

మరిన్ని వార్తలు