Andrea Jaeger: 30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను.. మాజీ టెన్నిస్‌ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు

26 Jun, 2022 16:20 IST|Sakshi

ప్రపంచ మాజీ నంబర్‌ 2 టెన్నిస్‌ క్రీడాకారిణి, రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఫైనలిస్ట్‌ అయిన ఆండ్రియా జేగర్‌ (అమెరికా) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ స్టాఫ్‌ మెంబర్‌ ఒకరు తనపై 30కి పైగా సందర్భాల్లో లైంగికంగా దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు టెన్నిస్ అసోసియేషన్‌కు చెందిన మరో  ప్రముఖుడు తనకు మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడని 57 ఏళ్ల ఆండ్రియా జేగర్‌ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.  

ఆండ్రియా జేగర్‌ 1980వ దశకంలో మహిళల టెన్నిస్‌లో స్టార్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. భుజం గాయం కారణంగా కెరీర్‌ అర్ధంతరంగా ముగియకముందు ఆమె 10కి పైగా టైటిళ్లు సాధించింది. జేగర్‌.. 1982 ఫ్రెంచ్ ఓపెన్, 1983 వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. జేగర్‌.. ప్రముఖ మహిళల టెన్నిస్‌ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా సమకాలీకురాలు.
చదవండి: వామ్మో కట్టెముక్కను విరిచినట్లు.. బ్యాట్‌ను సింపుల్‌గా

మరిన్ని వార్తలు