French Open 2021: గొప్ప ప్లేయర్‌ గెలిచాడు.. ఓటమిపై నాదల్‌ రియాక్షన్‌

12 Jun, 2021 09:53 IST|Sakshi

పారిస్‌: ప్రపంచం నెంబర్‌వన్‌ టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ టోర్నీలో అడుగుపెట్టాడు. 13 సార్లు ఛాంపియన్‌ అయిన రఫెల్‌ నాదల్‌ను జకోవిచ్‌ చిత్తుగా ఓడించాడు. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి రొలాండ్‌గారోస్‌లో జరిగిన మ్యాచ్‌లో జకోవిచ్‌  3-6, 6-3, 7-6(7/4), 6-2 సెట్స్‌తో నాదల్‌ను ఓడించడం విశేషం. 

నాదల్‌కి గత పదహారేళ్లలో(2005 నుంచి) క్లే కోర్టు గ్రాండ్‌ స్లామ్‌లో ఆడిన 108 మ్యాచ్‌లలో ఇది మూడో ఓటమి కాగా, 14 సెమీ ఫైనల్స్‌లో మొదటి ఓటమి. అంతేకాదు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ను రెండుసార్లు ఓడించిన ఏకైక వ్యక్తి జకోవిచ్‌ కావడం విశేషం. ఇక రోలాండ్‌ గారోస్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదటి సెట్‌నే కోల్పోవడం రఫెల్‌ నాదల్‌కి ఇదే ఫస్ట్ టైం. జకోవిచ్‌ గనుక ఈసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిస్తే.. 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ దక్కించుకోవడంతో పాటు నాలుగు గ్రాండ్‌ స్లామ్స్‌ టైటిల్స్‌ రెండేసి సార్లు గెల్చుకున్న ప్లేయర్‌గా రికార్డు సొంతం చేసుకుంటాడు. కాగా, ఓటమిపై నాదల్‌ స్పందిస్తూ. ‘బెస్ట్‌ ప్లేయర్‌ గెలిచాడు’ అని జకోవిచ్‌పై పొగడ్తలు గుప్పించగా. 34 ఏళ్ల సెర్బియన్‌ ప్లేయర్‌ జకోవిచ్‌ తన విక్టరీలలో ఇది గొప్పదని చెప్పుకొచ్చాడు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇక జకోవిచ్‌ ఆదివారం జరగబోయే ఫైనల్‌మ్యాచ్‌లో స్టెఫనోస్‌ సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మొట్టమొదటి గ్రీస్‌ ప్లేయర్‌ సిట్సిపాస్‌ కావడం విశేషం. గతంలో మూడుసార్లు గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలలో  సెమీఫైనల్‌​ అడ్డంకిని దాటలేకపోయిన ఈ యువ కెరటం.. శుక్రవారం జర్మనీకి చెందిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో తలపడి మూడున్నర గంటల హోరాహోరీ పోరు తర్వాత విజయం సాధించాడు.

చదవండి: ట్రాప్‌ చేసి వీడియో తీయమన్నారు

మరిన్ని వార్తలు